ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ | eacmcet counselling stopped by samaikyandhra supporters | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ

Aug 20 2013 5:49 AM | Updated on Sep 1 2017 9:56 PM

స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూలో సోమవారం నిర్వహించాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను సమైక్యవాదులు అడ్డుకోవడంతో ఆగిపోయింది. పాలిటెక్నిక్ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహణకు సిబ్బం ది ఎవరూ హాజరుకాలేదు. ప్రిన్సిపాల్ సూర్యనారాయణ విద్యార్థులతో ర్యాంకు కార్డులు తీసుకుని, ఉన్నతాధికారులతో సంప్రదించిన తర్వాత కౌన్సెలింగ్ తేదీని ప్రకటిస్తామన్నారు.

 జేఎన్‌టీయూ, న్యూస్‌లైన్ : స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూలో సోమవారం నిర్వహించాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను సమైక్యవాదులు అడ్డుకోవడంతో ఆగిపోయింది. పాలిటెక్నిక్ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహణకు సిబ్బం ది ఎవరూ హాజరుకాలేదు.  ప్రిన్సిపాల్ సూర్యనారాయణ విద్యార్థులతో ర్యాంకు కార్డులు తీసుకుని, ఉన్నతాధికారులతో సంప్రదించిన తర్వాత కౌన్సెలింగ్ తేదీని ప్రకటిస్తామన్నారు. అంతకుముందు విద్యార్థులు కౌన్సెలింగ్ కేం ద్రంలోకి వెళుతుండగా ఆగ్రహించిన సమైక్యవాదులు కౌన్సెలింగ్ కేంద్రానికి తాళం వేసి, వారిని అడ్డుకున్నారు.  కౌన్సెలింగ్ తప్పకుండా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో  జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 7 గంటలకే కౌన్సెలింగ్ కేం ద్రం వద్దకు చేరుకున్నారు.  కేంద్రంలో సిబ్బం ది ఎవరూ లేకపోగా కేవలం ప్రిన్సిపాల్ ఒక్కరే ఉన్నారు.
 
  ఎలాగైనా కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు వారు కేంద్రంలోకి వెళ్తుండగా సమైక్య వాదులు అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించేందుకు వీలులేదని అందరూ వెన క్కు పోవాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు, సమైక్య ఉద్యమకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుతోందని, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తుండగా కౌన్సెలింగ్‌కు ఎందుకు హాజరయ్యారని పాలిటెక్నిక్ సిబ్బం ది, ఉద్యోగులు, ఆందోళనకారులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నిలదీశారు. వీరి మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది.  కళాశాల సిబ్బంది, ఆందోళనకారు లు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. విద్యార్థినులు మోకాళ్లపై కూర్చొని సమైక్య నినాదాలు చేశారు. వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఎస్సై జాకీర్ హుసేన్  కళాశాల వద్దకు చేరుకున్నారు. సమైక్యవాదులతో చర్చించారు.
 
  ప్రిన్సిపల్ సూర్యనారాయణరెడ్డిని పిలిపించి కౌన్సెలింగ్ జరుగుతుందా?లేదా? తర్వాత ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాలన్నారు. ప్రిన్సిపాల్ సమాధానమిస్తూ పాలిటెక్నిక్ టీచింగ్ స్టాఫ్ సమ్మెలో ఉన్నారన్నారు. నాన్‌టిచింగ్ సిబ్బంది కూడా సమ్మె నోటీసు ఇచ్చారన్నారు. సిబ్బంది లేకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం అసాధ్యమన్నారు. అధికారులను సంప్రదించి తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్‌కు తెలిపేందుకు విద్యార్థుల నుంచి ర్యాంకు కార్డులను తీసుకున్నామన్నారు. వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, తిరిగి విద్యార్థులకు అందచేస్తామని ప్రిన్సిపాల్ వివరించారు.   కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులను, తల్లిదండ్రులను  సీఐ వెనక్కు పంపారు
 వర్సిటీలో అడ్మిషన్ల కార్యాలయానికి తాళం
 
 ఎస్కేయూ : వర్సిటీలో సహాయ కేంద్రంలో నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు.  కౌన్సెలింగ్ అధికారి ప్రొఫెసర్ దశరథరామయ్యతో సమైక్యవాదులు వాగ్వాదానికి దిగారు.  అప్పటికే దూరప్రాం తాల నుంచి అనేక మంది విద్యార్థులు,వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన కౌన్సెలింగ్‌ను సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు అడ్డుకొని అడ్మిషన్ల డెరైక్టర్‌తో వాగ్వాదానికి దిగారు.
 
  కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని అడ్మిషన్ల కార్యాలయానికి తాళం వేసి గంటకుపైగా బైఠాయించారు. వారు మాట్లాడుతూ ఎంసెట్ కౌన్సెలింగ్ ఖచ్చితంగా నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర నరసింహ ఆదేశాలు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. ‘ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమాలు చేస్తున్నప్పుడు అనేక కోర్సుల కౌన్సెలింగ్‌లు నిలిపివేసిన విషయం గుర్తుకు రాలేదా’ అని డెప్యూటీ సీఎంను ప్రశ్నించారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటించే వరకు ఎలాం టి కౌన్సెలింగ్‌లు, తరగతులు జరగనివ్వబోమని సమైక్యవాదులు తెలిపారు. కౌన్సెలింగ్ అధికారి మాట్లాడుతూ బోధన, బోధనేతర సిబ్బంది కౌన్సెలింగ్ విధులకు హాజరుకాలేమని లేఖ ఇచ్చారని తెలిపారు. కౌన్సెలింగ్ చేపట్టే పరిస్థితి లేదని, అనంతరం  ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో ఉద్యమనేత డాక్టర్ సదాశివరెడ్డి, విద్యార్థుల జేఏసీ నాయకులు, బోధనేతర జేఏసీ నాయకులు పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement