డీవీ సుబ్బారావుకు అస్వస్థత | DV Subba Rao to illness | Sakshi
Sakshi News home page

డీవీ సుబ్బారావుకు అస్వస్థత

Dec 20 2014 1:28 AM | Updated on Sep 2 2017 6:26 PM

డీవీ సుబ్బారావుకు అస్వస్థత

డీవీ సుబ్బారావుకు అస్వస్థత

ప్రముఖ న్యాయవాది, నగర మాజీ మేయర్,మాజీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ డి.వి.సుబ్బారావు

విశాఖపట్నం లీగల్ : ప్రముఖ న్యాయవాది, నగర మాజీ మేయర్,మాజీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా ఛైర్మన్ డి.వి.సుబ్బారావు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆయన్ను కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని కేర్ హాస్పటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు  ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

డీవీ గత కొంత కాలంగా శ్వాసకోశకు సంబంధించిన వ్యాధితో భాద పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం చికిత్స తీసుకున్నారు. సుబ్బారావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు న్యాయవాదులు,అభిమానులు హాస్పటల్ వద్దకు చేరుకున్నారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని సుబ్బారావు తనయుడు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement