'20 లక్షలు తీసుకొని.. విడాకులివ్వమన్నారు' | doctor sai krishna harrassing wife for Additional dowry in guntur | Sakshi
Sakshi News home page

'20 లక్షలు తీసుకొని.. విడాకులివ్వమన్నారు'

Jan 27 2017 1:59 PM | Updated on Sep 5 2017 2:16 AM

'20 లక్షలు తీసుకొని.. విడాకులివ్వమన్నారు'

'20 లక్షలు తీసుకొని.. విడాకులివ్వమన్నారు'

అదనపు కట్నం కోసం అత్తింట్లో వేధింపులు ఎదురవడంతో ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.

గుంటూరు: అదనపు కట్నం కోసం అత్తింట్లో వేధింపులు ఎదురవడంతో ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. జిల్లాలోని చుండూరు మండలం వేటపాలెంకు చెందిన పీజీ వైద్య విద్యార్థిని దేవిలక్ష్మిని డాక్టర్‌ సాయికృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన పది రోజుల నుంచే అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. 14 నెలలుగా వేధిస్తూనే ఉండగా అతని తల్లిదండ్రులు కూడా కొడుక్కు వత్తాసు పలుకుతూ విడాకులు ఇవ్వాలని బెదిరిస్తున్నారు.

కాగా, ప్రభుత్వ విప్‌ దూళిపాళ్ల నరేంద్ర కూతురును సాయి కృష్ణకు ఇచ్చి వివాహం చేయాలని చూస్తున్నారని దేవిలక్ష్మి తల్లి వాణి ఆరోపించారు. అందుకే తమకు రూ.20 లక్షలు ఇచ్చి విడాకులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడటంతో దేవి లక్ష్మి ఆ‍త్మహత్యయత్నానికి పాల్పడిందని పేర్కొన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని దేవిలక్ష్మి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. సాయికృష్ణ తండ్రి సాంబశివరావు నాగార్జున యూనివర్సిటీలో రెక్టార్‌గా పనిచేస్తుండగా తల్లి కృష్ణశ్రీ పొగాకు బోర్డు ఉద్యోగి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement