సోషల్‌ మీడియాతో ఎన్నో అనర్థాలు

Devulapalli Amar Speech In Gokavaram At East Godavari District - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌

విషయంలో వాస్తవాన్ని పరిశీలించకుండా, బాధ్యతారహితంగా ప్రచారం చేస్తున్న సోషల్‌ మీడియాతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, దీనిని గుడ్డిగా నమ్మవద్దని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ హితవు పలికారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యాన ‘సమా జంలో మార్పు – మీడియా పాత్ర’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో అమర్, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

గోకవరం (జగ్గంపేట): విషయంలో వాస్తవాన్ని పరిశీలించకుండా, బాధ్యతారహితంగా ప్రచారం చేస్తున్న సోషల్‌ మీడియాతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, దీనిని గుడ్డిగా నమ్మవద్దని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ హితవు పలికారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యాన ‘సమా జంలో మార్పు – మీడియా పాత్ర’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో అమర్, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజే యూ) జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమర్‌ మాట్లాడుతూ, నేటి సమాజంలో సోషల్‌ మీడియా విస్తృతమైందన్నారు. సమాచారం వేగంగా అందజేయాలనే తపనలో మీడియా విశ్వసనీయతే ప్రమాదంలో పడిందన్నారు. సోషల్‌ మీడియా అసలు మీడియానే కాదన్నారు. పత్రికారంగంలో వేగం మంచిదే కానీ, ఆ తొందరలో పొరపాట్లకు తావీయకూడదని సూచించారు. మీడియాకు సామాజిక బాధ్యత ఉందని, ప్రతి అంశాన్నీ పరిశోధించి, వాస్తవాలను ప్రజల ముందుంచుతుందని చెప్పా రు. రాష్ట్రంలో నిరాదరణకు గురైన ప్రెస్‌ అకాడమీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభు త్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికే ప్రెస్‌ అకాడమీకి చైర్మన్‌ను నియమించారని, త్వరలో సభ్యులను నియమించి విధివిధానాలను సిద్ధం చేస్తారని చెప్పారు. గతంలో ఓ వార్తను పత్రికా ప్రచురణ సంస్థకు పోస్టల్‌లో పంపించేవాళ్లమని, ఆ కవరు మూడు రోజుల తరువాత అందేదని, ఆ వార్త ప్రచురితమైన మూడు రోజుల తరువాత ఆ పత్రిక పట్టణాలకు చేరేదని పాత రోజుల పాత్రికేయ వృత్తిని గుర్తు చేశారు.

తరువాత బస్సులు వచ్చాక, బస్సు డ్రైవర్‌కు రెండు రూపాయలు ఇచ్చి పంపించేవాళ్లమని, దీంతో వార్తల వేగం కొద్దిగా పెరిగిందని, ఇలా క్రమేపీ తన వేగా న్ని పెంచుకుంటూ నేడు జెట్‌ స్పీడుకు చేరిందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసేస్తోందని, టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు వచ్చేస్తున్నాయని, దీంతో పత్రికల్లో తరువాత రోజు వచ్చిన వార్త పాచి వార్తగా తయారవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పత్రికలు అదే విషయాన్ని కొత్తగా ప్రజెంట్‌ చేయడానికి పోటీ పడుతున్నాయని, ఇది చాలెంజ్‌గా తయారైందని అమర్‌ అన్నారు. 

ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు బాధ్యత మీడియా పైనే ఉందని అన్నారు. గ్రామీణ పాత్రికేయులు వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తొలుత కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని అనేక అంశాలపై అవగాహన కలిగి ఉండి, సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి పాత్రికేయులు కృషి చేస్తున్నారన్నారు. పాలనా వ్యవస్థలోని నాలుగు ఎస్టేట్‌లలో పత్రికా రంగం ఒక భాగమన్నారు. ప్రజలకు మరిన్ని సేవలందించడానికి ప్రభుత్వ యంత్రాంగానికి పాత్రికేయులు సహకారం అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ అస్మీ మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థకు పాత్రికేయులు తమ వంతు సహకారం అందిస్తున్నారన్నారు. ఏపి బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, చట్టాలపై పాత్రికేయులు అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్‌ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్‌ చైర్మన్‌ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, ఆదిత్య విద్యాసంస్థల తరఫున పాత్రికేయులకు జర్నలిజంపై శిక్షణ ఇచ్చేందుకు సహకారం అందిస్తామన్నారు. ఈ శిక్షణను ఐదు జిల్లాల్లోని తమ కళాశాలల్లో ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ నాయకుడు సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ తదితరులు కూడా ప్రసంగించారు. అనంతరం దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్‌రెడ్డిలను నల్లమిల్లి శేషారెడ్డి, సతీష్‌రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కె.స్వాతిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్మూర్తి తదితరులు సన్మానించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు డీఎస్‌ఎస్‌ రామాంజనేయరావు, జిల్లా కార్యదర్శి సుంకర ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రాకుర్తి రాంబాబు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top