రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ దీక్షలు | Devotees Ready To take Sri Rama Deeksha from March 25 To April 2 | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ దీక్షలు

Mar 14 2020 2:58 PM | Updated on Mar 14 2020 3:08 PM

Devotees Ready To take Sri Rama Deeksha from March 25 To April 2 - Sakshi

విజయవాడ : మహా విద్యాపీఠం, ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో మార్చి 25 నుండి ఏప్రిల్ 2 వరకూ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు శ్రీరామ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహా విద్యాపీఠం వ్యవస్ధాపకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శ్రీరామ దీక్ష చేపట్టడానికి దాదాపు లక్షమంది సిద్ధంగా ఉన్నారన్నారు.

దీక్షకు సంబంధించిన శ్రీరామ రక్షా స్తోత్రం కరపత్రాలు, జపమాలలు, బ్యానర్లు, జెండాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు పంపిణీ చేశారన్నారు. తొలి ఏడాదే లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనన్నట్లు తెలిపారు. దీక్షలో భాగంగా ఏప్రిల్‌ 4న శ్రీరామ జన్మస్థానమైన అయోధ్యలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని మహా విద్యాపీఠం, ధర్మ జాగరణ సమితి ఆధ్వరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement