 
															కేటిఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చ, ఓటింగ్ జరుగకపోయినా పర్వాలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ అన్నారు.
	నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చ, ఓటింగ్ జరుగకపోయినా పర్వాలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు. బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ వజ్రోత్సవ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు.
	
	తెలంగాణపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  మాట తప్పారని విమర్శించారు. అందుకే ఆయన రెంటికి చెడ్డ రేవులా తయారయ్యారన్నారు.  స్వప్రయోజనాల కోసం చంద్రబాబు నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక మన ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీని టేకోవర్ చేస్తుందని చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
