వైద్యం వికటించి గర్భిణి మృతి | death of a pregnant with wrong treatment | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి గర్భిణి మృతి

Dec 12 2015 2:39 PM | Updated on Sep 3 2017 1:53 PM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని ఆశ్రమం ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని ఆశ్రమం ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. లింగపాలెం మండలం మేడిచర్లకు చెందిన సాలూరి భార్గవి (26)కి నొప్పులు అధికం కావడంతో శనివారం తెల్లవారుజామున ఆశ్రమం ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యం ప్రారంభించిన తర్వాత బిడ్డను కనకముందే భార్గవి మృతి చెందింది. శస్త్రచికిత్స చేసేందుకు మత్తుమందు ఇవ్వగా, ఊపిరితిత్తులు పట్టేసి గుండెకు స్ట్రోక్ రావడంతో ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.  భార్గవి, శివయ్య దంపతులకు రెండు సంవత్సరాల కుమార్తె ఉంది.



 

Advertisement
 
Advertisement
Advertisement