అత్తింటి ముందు కొనసాగుతున్న దీక్ష... | daughter-in-law dharna continues to second day at mother-in-law house | Sakshi
Sakshi News home page

అత్తింటి ముందు కొనసాగుతున్న దీక్ష...

Nov 26 2013 10:07 AM | Updated on May 25 2018 12:54 PM

ఆస్తిలో వాటా కావాలని కూతురితో కలిసి అత్తింటి ముందు ధర్నా చేస్తున్న కోడలి దీక్ష రెండవ రోజుకు చేరుకుంది.

 నాగోలు : ఆస్తిలో వాటా కావాలని కూతురితో కలిసి అత్తింటి ముందు ధర్నా చేస్తున్న కోడలి దీక్ష రెండవ రోజుకు చేరుకుంది.  ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన లింగారెడ్డి అదే ప్రాంతానికి చెందిన దివ్యారెడ్డితో 2009లో వివాహమైంది. లింగారెడ్డి మరో పెళ్లి చేసుకోవడంతో పాటు ఎన్‌టీఆర్‌నగర్‌లో ఉన్న ఇంటిని అమ్మేశాడు. విషయం తెలుసుకున్న దివ్య ఆదివారం అత్తింటివారి ముందు ధర్నాకు దిగింది. అమ్మిన ఇంట్లో తన కూతురి పోషణ కోసం వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. దీంతో సోమవారం పెద్దమనుషులతో చర్చలు జరిపినా ఫలించకపోవడంతో దీక్ష కొనసాగిస్తోంది.

వివరాల్లోకి వెళితే మొదటి భార్యకుతెలియకుండా ఓ ప్రబుద్ధుడు రెండు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. తర్వాత ఇల్లు అమ్ముకుని  వెళ్లిపోతుండగా  మొదటి భార్య అడ్డుకొని అత్తారింటి వద్ద ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన దివ్యకు నల్లగొండజిల్లా పెద్దకొండూరుకు  చెందిన లింగారెడ్డితో 2009లో పెళ్లైంది. వీరికి లాస్య అనే పాప ఉంది. లింగారెడ్డి ఎన్టీఆర్‌నగర్‌లో స్టేషనరీషాపు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement