ఆరు ఎకరాల్లో అరటి బుగ్గి | crop loss due to fire accident | Sakshi
Sakshi News home page

ఆరు ఎకరాల్లో అరటి బుగ్గి

Mar 16 2015 4:58 PM | Updated on Sep 5 2018 9:45 PM

వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లెలో ఆరెకరాల్లోని అరటి పంట అగ్నిప్రమాదం వల్ల పూర్తిగా దగ్ధమైంది.

పులివెందుల : వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లెలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం వల్ల ఆరెకరాల్లోని అరటి పంట పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే... బ్రాహ్మణపల్లె గ్రామంలోని రైతు మల్‌రెడ్డికి చెందిన అరటి తోటలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది.

 

ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, పులివెందుల మునిసిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి సందర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement