అనుమతి లేకుండా బోట్లు నడిపితే క్రిమినల్‌ చర్యలు

Criminal Cases On Without Permition Boats : Collector - Sakshi

కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం

విజయవాడ: నిబంధనలు పాటించని బోటు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం హెచ్చరించారు. గురువారం ఆయన తీర ప్రాంత పరిధిలో మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రెవెన్యూ, జలవనరు ల శాఖ పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులతో వాటర్‌ సేఫ్టీ, బోట్లు సామర్థ్యంపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తీర ప్రాంతాల్లో నడిపే బోట్లకు తప్పనిసరిగా అనుమతులుండాలన్నారు. అనధికారికంగా తిరిగే బోట్లను స్వాధీనం చేసుకుని, యజమానులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

బోట్లను ఉదయం నుంచి సాయంత్రం లోపు నిర్ణీత కాల వ్యవధిలోనే నడపాలని, సాయంత్రం 5.30 నిమిషాల తర్వాత, చీకటి వేళల్లో బోట్లను తిప్పరాదన్నారు. బోట్లలో ప్రయాణించే వారు విధిగా లైఫ్‌ జాకెట్లు ధరించాలన్నారు.పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదన్నారు. బోటు నడిపే డ్రైవర్‌ (సారంగ్‌)కు తప్పనిసరిగా లైసెన్స్‌ ఉండాలన్నారు. రెవెన్యూ, పోలీస్, జలవనరులు, అటవీ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో బోట్లను తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించరాదని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తీరప్రాంతాల మండలాలైన ఇబ్రహీంపట్నం, చందర్లపాడు, నాగాయలంక, కృత్తివెన్ను, తోట్లవల్లూరు మండలాల పరిధిలో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి బోట్లను తనిఖీలు చేశారు.

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో కృష్ణా నం.1
విజయవాడ: ఆరోగ్యవంతమైన చిన్నారులు కలి గిన జిల్లాగా కృష్ణా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం చెప్పారు. గురువారం ఆయన స్త్రీ, శిశు సంక్షేమం, వైద్య శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దాతల సహకారంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించటం వల్ల వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top