గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిలోని చినకాకాని వద‍్ద ఉన‍్న టపాసుల గోదాములో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.
చినకాకానిలో భారీ పేలుడు
Sep 6 2017 12:29 PM | Updated on Apr 3 2019 3:52 PM
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిలోని చినకాకాని వద‍్ద ఉన‍్న టపాసుల గోదాములో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. గోదాములో బాణాసంచాకు మంటలు అంటుకోవడంతో ఈ పేలుడు జరిగింది. టపాసుల పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందుకున‍్న పోలీసులు, అగ్నిమాపక సిబ‍్బంది సంఘటన స‍్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో రహదారిపై వాహక రాకపోకలు నిలిచిపోయాయి.
Advertisement
Advertisement