పోలీసుల వేధింపులతో దంపతుల ఆత్మహత్యాయత్నం | Couple Suicide Attempt With Police Harassment in Proddatur | Sakshi
Sakshi News home page

పోలీసుల వేధింపులతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Oct 19 2019 11:33 AM | Updated on Oct 19 2019 11:34 AM

Couple Suicide Attempt With Police Harassment in Proddatur - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. ప్రొద్దుటూరు ఒకటో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శ్రీనివాసులు రెడ్డి అనే చీటీ ఏజెంట్‌ ప్రజలను మోసం చేసి పారిపోయాడు. ఆచూకీ చెప్పాలని అతని స్నేహితుడైన మురళిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఈ నేపథ్యంలో తనకు ఏ సమాచారం తెలియదని చెప్తున్నా నాలుగు రోజులుగా పోలీసులు వినిపించుకోవట్లేదని బాధితుడు ఆవేదనకు గురయ్యాడు. పోలీసుల తీరుతో విసిగిపోయిన మురళి దంపతులు శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో స్పందించిన పోలీసులు దంపతులను చికిత్స కోసం హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement