కరోనా పరీక్షలు చేయించుకున్న ఎంపీ భరత్‌ | Corona Tests To YSRCP MP Margani Bharat Ram | Sakshi
Sakshi News home page

కరోనా పరీక్షలు చేయించుకున్న ఎంపీ భరత్‌

May 11 2020 11:39 AM | Updated on May 11 2020 12:05 PM

Corona Tests To YSRCP MP Margani Bharat Ram - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గని భరత్‌రామ్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం స్థానిక వైద్యులు ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజాజీవితంలో ఉండటంతో ఇప్పటివరకు కుటుంబంతో కలవడం సాధ్యం కాలేదని తెలిపారు. తనపై సోషల్‌ మీడియా, కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ వేదికగా వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశానని, పరువునష్టం దావా వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాని భరత్‌రామ్‌ తెలిపారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement