ప్రభుత్వం హామీ నెరవేర్చాలంటూ.. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం హామీ నెరవేర్చాలంటూ.. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. అనంతపురంలోని నగర పంచాయతి కార్యలయ పరిధిలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నతమను ప్రభుత్వం మోసం చేసిందని.. వేతనాలను పెంచుతామని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని మేయర్ చాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ హామీ వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు.