31 వరకు ‘కానిస్టేబుల్‌’ దేహదారుఢ్య పరీక్షలు | constable physical tests till 31st | Sakshi
Sakshi News home page

31 వరకు ‘కానిస్టేబుల్‌’ దేహదారుఢ్య పరీక్షలు

Dec 24 2016 1:09 AM | Updated on Aug 18 2018 8:49 PM

31 వరకు ‘కానిస్టేబుల్‌’ దేహదారుఢ్య పరీక్షలు - Sakshi

31 వరకు ‘కానిస్టేబుల్‌’ దేహదారుఢ్య పరీక్షలు

రాష్ట్రంలో భర్తీ చేయనున్న కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించి కాకినాడలో దేహదారుఢ్య పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్‌ శుక్రవారం తెలిపారు.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భర్తీ చేయనున్న కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించి కాకినాడలో దేహదారుఢ్య పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్‌ శుక్రవారం తెలిపారు. కాకినాడ మినహా అన్ని జిల్లాల్లోనూ ఈ పరీక్షలు పూర్తి అయ్యాయని, ఇటీవల తుపాను ప్రభావం కారణంగా కాకినాడలో వాయిదా పడిన దేహదారుఢ్య పరీక్షలను 24 నుంచి ఈ నెల 31 వరకు కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,216 సివిల్‌ కానిస్టేబుల్స్, 1,067 ఏఆర్‌ కానిస్టేబుల్స్, వార్డర్స్‌(పురుషులు) 240, మహిళలు 25 పోస్టుల భర్తీకి రాత పరీక్షల అనంతరం దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ చేపట్టినట్టు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement