'కుప్పం... చంద్రబాబు అబ్బసొత్తు కాదు' | CITU Leader takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'కుప్పం... చంద్రబాబు అబ్బసొత్తు కాదు'

May 23 2015 1:50 PM | Updated on Sep 3 2017 2:34 AM

కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీఐటీయూ నేత కందారపు మురళి శనివారం చిత్తూరులో ఆరోపించారు.

చిత్తూరు : కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీఐటీయూ నేత కందారపు మురళి శనివారం చిత్తూరులో ఆరోపించారు.వీధి రౌడీల్లా వ్యవహరించారని ఆయన టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. కుప్పం... సీఎం చంద్రబాబు అబ్బసొత్తు కాదన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చనందుకు స్థానికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఎన్నికల హామీలపై శుక్రవారం సాయంత్రం సీఐటీయూ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ సీపీఎం నేతలపై టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు దాడి చేస్తుంటే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement