
చంద్రబాబు పర్యటన ఇలా
ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ నెల 16, 17 తేదీల్లో జిల్లాలో పర్యటనకు సంబంధించిన వివరాలను జిల్లా సమాచార శాఖ సోమవారం విడుదల చేసింది.
ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ నెల 16, 17 తేదీల్లో జిల్లాలో పర్యటనకు సంబంధించిన వివరాలను జిల్లా సమాచార శాఖ సోమవారం విడుదల చేసింది. ఈనెల 16న ఉద యం 10.30 గంటలకు చంద్రబాబు ద్వారకాతిరుమల చేరుకుని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుం టారు. 11 గంటలకు తాడిచర్ల చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడతారు. అనంతరం ఆ గ్రామంలో పర్యటిస్తారు. 11.50 గంటలకు కామవరపుకోట చేరుకుని వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాల్స్‌ను సందర్శిస్తారు. లబ్ధిదారులకు ఉపక రణాలు అందిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ నిర్వహించే రైతు సమావేశంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పలపాడు చేరుకుని రైతులతో ముచ్చటించి గ్రామాన్ని సందర్శిస్తారు. 3.30 గంటలకు రావికంపాడు జంక్షన్, సాయంత్రం 4 గంటలకు దేవులపల్లి జంక్షన్‌లో రైతులతో మాట్లాడి ఆయా గ్రామాలను సందర్శిస్తారు. 4.30 గంటలకు మద్దిఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుం టారు. 5గంటలకు గుర్వారుుగూడెంలో రైతులతో మాట్లాడి, గ్రామాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు జంగారెడ్డిగూడెం మసీదు జంక్షన్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి 7.30నుంచి 9.30 గంటల వరకూ జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రం వల్ల ప్రజాప్రతి నిధులతో సమావేశం అవుతారు. రాత్రి 9.30 గంటలకు నవభారత్ అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారు. 17న ఉదయం 8నుంచి 11 గంటల వరకు జంగారెడ్డిగూడెంలో జిల్లా అధికారులతో సమీక్షిస్తారు.
ఉదయం 11.15 గంటలకు నరసన్నపాలెం, 11.30 గంటలకు బయ్యనగూడెంలో రైతులతో మాట్లాడి గ్రామాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కొయ్యలగూడెం చేరుకుని టుబాకో బోర్డును సందర్శించి రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను సందర్శించి లబ్ధిదారులకు ఉపకరణాలు పంపిణీ చేస్తారు. 12.45నుంచి 2.30 గంటల వరకు కొయ్యలగూడెంలో నిర్వహించే స్వయం సహాయక మహిళల సమావేశంలో పాల్గొంటారు. 3 గంటలకు కొయ్యలగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ పయనమవుతారు.