ఇదేమి దా‘రుణం’

ఇదేమి దా‘రుణం’


ఏలూరు :జిల్లా పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు రుణం అందని ద్రాక్షలా ఊరిస్తోంది. వీరికి రుణం అందించే అంశంపై ఎవరూ పట్టించుకోకపోవడంతో కనీసం 35 శాతం కూడా లక్ష్యానికి బ్యాంకర్లు చేరువ కాలేదు. 2014 ఏప్రిల్ నాటికే రుణం అందజేతకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉండగా, అక్టోబర్ నెలలో ఈ తంతు చేపట్టారు. దీంతో రుణం అందరికీ అందటం గగనంగా మారింది. ఏలూరు కార్పొరేషన్‌తో పాటు ఏడు పురపాలక సంఘాలు, ఓ నగర పంచాయతీలో కలిపి దాదాపుగా పదివేల సంఘాలున్నట్టు అంచనా. కాగా ఇందులో కేవలం 2014-15 ఆర్థిక సంవత్సరానికి 3243 సంఘాలకు రూ.95 కోట్లు రుణం అందివ్వాలన్న లక్ష్యం కాగా కేవలం 1093 సంఘాలకు రూ.36.19 కోట్లు బ్యాంకర్లు ఇచ్చారు. ఒక్క పాలకొల్లు మున్సిపాల్టీలో మాత్రం 70 శాతం వరకు రుణం ఇచ్చారు. ఏలూరుతో పాటు మిగిలిన అన్ని సంఘాల్లోను రుణం తూతూ మంత్రంగా ఇచ్చినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

 

 రుణమాఫీతోనే సంఘాల తంటాలు

 డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయన్న కారణంగా కొన్ని సంఘాలు గతంలోని రుణాలు తీర్చలేదు. దీనికితోడు బ్యాంకు లింకేజీ రుణం కూడా నామమాత్రంగా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రుణం సకాలంలోచెల్లించిన సంఘాలకు మొదటి విడతగా రూ.75 వేలు, రెండో విడతగా రూ.1.50 లక్షలు, మూడో విడతగా రూ.2.50 లక్షలు సంఘంలోని 10 నుంచి 15 మంది సభ్యులకు ఇవ్వాల్సి ఉండగా ఎక్కడా కూడా రూ.లక్షకు మించి ఇవ్వడం లేదని మహిళా సం ఘాలు పెదవి విరుస్తున్నాయి. కాగా సకాలంలో రుణం చెల్లించినా బ్యాం కర్లు మాత్రం చాలా పట్టణాల్లో మోకాలడ్డుతుండటంతో మహిళలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

 మెప్మా పీడీ పోస్టు ఖాళీ... పర్యవే క్షణ శూన్యం

 జిల్లాలో పురపాలక సంఘాల్లో రుణాల అందజేతను మున్సిపల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రాజెక్టు డెరైక్టర్ పర్యవేక్షించాలి. కాగా ఈ పోస్టు మూడు నెలల నుంచి ఖాళీగా ఉంది. జిల్లా ముఖ్యప్రణాళిక  శాఖ జాయింట్ డెరైక్టర్ కె.సత్యనారాయణ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. కాగా జిల్లా స్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతో అటు బ్యాంకర్లు, ఇటు మునిసిపల్ అధికారులు రుణం జారీ చేసే విషయంలో బ్యాంకర్ల సహకారం అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఇది మహిళల ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అధికారులు, బ్యాంకర్లు స్పందిస్తే తమ సమస్య తీరుతుందని పలు మహిళా సంఘాలు అంటున్నాయి.

 

 రుణ లక్ష్యం...మంజూరు చేసిన విధం పురపాలక సంఘాల వారీగా ఇలా..

 పురపాలక సంఘం    ఎస్‌హెచ్‌జీలు    లక్ష్యం    పొందిన    రుణ మొత్తం

         రూ.కోట్లలో    సంఘాలు      (రూ.కోట్లలో)

 ఏలూరు కార్పొరేషన్    759    19.75     216    8.02

 భీమవరం    500    15    158    5.69

 జంగారెడ్డిగూడెం    187    8    58    1.58

 కొవ్వూరు    199    6.45    76    2.13

 నర్సాపురం    268    7.50    95    2.67

 నిడదవోలు    199    6.30    97    2.82

 పాలకొల్లు    259    8.15    175    6.91

 తాడేపల్లిగూడెం    500    14.85    102    3.56

 తణుకు    372    9    116    2.77

 మొత్తం సంఘాలు    3243    95    1093    36.19

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top