చంద్రబాబు అవినీతిచక్రవర్తి  

Chandrababu Is Corrupt In AP - Sakshi

అమరావతిలో అంతర్జాతీయస్థాయి కుంభకోణం

రూ.4లక్షల కోట్ల అవినీతి

వైఎస్సార్‌సీపీ కోవూరు అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి

బుచ్చిరెడ్డిపాళెం: ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిచక్రవర్తి అని  వైఎస్సార్‌సీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని కాగులపాడు, శ్రీరంగరాజపురంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయస్థాయి కుంభకోణం జరిగిందన్నారు. రాజధాని నిర్మాణం పేరిట సీఎం చంద్రబాబు బినామీలుగా మంత్రి నారాయణ, సీఎం రమేష్, లింగంనేని రమేష్, కంభంపాటి రామ్మోహన్‌రావును పెట్టుకుని భూదోపిడీకి పాల్పడ్డారన్నారు.

ముందుగానే రాజధాని పక్కన భూములను అక్కడి రైతులను భయపట్టి తక్కువ ధరలకు కొనుగోలు చేసి చంద్రబాబునాయుడు రూ.కోట్లకు పడగలెత్తాడన్నారు. రూ.4 లక్షల కోట్ల అవినీతి చోటు చేసుకుందన్నారు. చంద్రబాబుది అప్రజాస్వామిక పాల న అని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా తొలి నుంచి ప్రజల మధ్యే ఉన్నాడ ని, పోరాటాలు చేస్తూనే ఉన్నారన్నారు. ప్రత్యేక హో దా కోసం పోరాడింది జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తుచేశారు. అందుకే ప్రజా సంక్షేమం కోసం నవరత్నా ల పథకాలను ప్రవేశపెట్టారన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. శాసనసభకు తనను, పార్లమెంట్‌కు ఆదాల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు చీమల రమేష్‌బాబు, నెల్లూరు గోపాల్‌రెడ్డి, పగడాల కృష్ణారెడ్డి, బిల్లా వినోద్‌కుమార్, సూరా శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. 

వైఎస్సార్‌సీపీలో చేరిక
కాగులపాడుకు చెందిన టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి బీద మస్తాన్‌ రావు మేనల్లుడు దాసరి శ్రీకాంత్‌తో పాటు వి.హరిబాబు, పి.శ్రీనివాసులు, కల్వకుంట్ల రమేష్‌నాయుడు, గురవయ్య, పగడాల శ్రీనివాసులురెడ్డి. పుత్తేటి శివారెడ్డి, విజయ్‌కుమార్, స్వాములురెడ్డి, బాబిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బొనిగల సుబ్బయ్య తదితరులు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి ప్రసన్నకుమార్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top