
పటమట (విజయవాడ తూర్పు): ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది జరుపుకునే క్రిస్మస్ అందరి పండుగని, దేవుడు మనిషి రూపంలో వచ్చి ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవటం మంచి పరిణామమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయ వాడలోని పటమట సెయింట్ పాల్స్ కథెడ్రెల్ చర్చిలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
బైబిల్‌లోని 121వ వచనంలోని 1–8వ వచనం వరకు చదివి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. క్రైస్తవ సంస్థలు, చర్చిలు, ఎన్‌జీవోలు పేదరిక నిర్మూలన కోసమే పనిచేస్తు న్నాయని.. విద్యా, వైద్యం, సేవా రంగాల్లో క్రైస్తవ మిషనరీల త్యాగం ఎనలేనిదన్నారు. కాగా, ఇప్పటివరకు చర్చిల నిర్మాణానికి కేటాయింపులను రూ.5లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. అంతకు ముందు విజయవాడ కథోలిక్ పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు కథోలిక పీఠం గురించి, క్రైస్తవ మిషనరీల సేవా కార్యక్రమాల గురించి వివరించారు.