నరకం ఎక్కడుందంటే చంద్రబాబు పాలనలో అని రైతులు ఠకీమని జవాబు చెబుతారు. కరెంట్ బిల్లులు కట్టలేదని జైల్లో పెట్టిన బాబు పాలనను తామింకా మరిచిపోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వామ్మో నరకం
నరకం ఎక్కడుందంటే చంద్రబాబు పాలనలో అని రైతులు ఠకీమని జవాబు చెబుతారు. కరెంట్ బిల్లులు కట్టలేదని జైల్లో పెట్టిన బాబు పాలనను తామింకా మరిచిపోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నకు వెన్నుదన్నుగా నిలవాల్సిన పాలకుడే వెన్నువిరిస్తే ఎలా ఉంటుందో ఎన్నికల తరుణంలో బాబు తొమ్మిదేళ్ల పాలన తమను పీడ కలలా భయ పెడుతోందన్నారు. మహానేత వైఎస్సార్ వ్యవసాయం అంటే పండగ అని అనడమే కాకుండా చేసి చూపించారన్నారు. వ్యవసాయం దండగ అన్న బాబు పాలనను ఎవరూ కోరుకోవడం లేదని అంటున్నారు.
బాబుది రాక్షస పాలన
చంద్రబాబు పాల న రైతులపాలిట రాక్షస పాలనే. రైతులను ఆయన సంక్షోభంలోకి తీసుకెళ్లాడు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులను సంక్షేమ బాటలో నడిపించారు.
-నాగం బాబునాయుడు, వెంగమాంబ
పురం, బాలాయపల్లి మండలం
రైతులపై క్రిమినల్ కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుదే
రైతులపై క్రిమినల్ కేసులు పెట్టిన ఘనత ఒక్క చంద్రబాబుదే అని చెప్పక తప్పదు. కరెంట్ బిల్లులు కట్టలేదని రైతులపై క్రిమినల్ కేసులతో జైల్లో పెట్టాడు. వ్యవసాయ మోటార్లను ట్రాన్స్‌కో అధికారులు ఎత్తుకెళ్లడం కళ్లముందు కదలాడుతోంది.
-వడ్లపడి జయచంద్ర,
వెంగమాంబపురం