శ్రీవారి సేవలో ప్రముఖులు | Celebrities visit in tirula sri varu | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రముఖులు

Nov 2 2015 2:20 AM | Updated on Sep 3 2017 11:50 AM

శ్రీవారి సేవలో ప్రముఖులు

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల : తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర మంత్రి నారాయణ, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వీ.మోహన్‌రెడ్డి, చిత్తూరు జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, రాజ మండ్రి మేయర్ రజని శేషసాయి, న్యూఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ జాయింట్ సెక్రటరీ కైలాష్ చం ద్ సామారియా ఉన్నారు.

వీరు కుటుంబ సభ్యులతో కలసి ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఆలయాధికారులు ప్రత్యేక దర్శ న ఏర్పాట్లు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement