టీడీపీ నాయకుల వీరంగం | Cc cameras destroyed municipal office | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల వీరంగం

Jan 6 2015 2:23 AM | Updated on Oct 16 2018 6:27 PM

టీడీపీ నాయకుల వీరంగం - Sakshi

టీడీపీ నాయకుల వీరంగం

నగరి పట్టణంలో సోమవారం టీడీపీ నాయకులు వీరంగం సృష్టిం చారు. మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.

నగరిలో ఉద్రిక్తత
మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాల ధ్వంసం
చైర్‌పర్సన్‌కు గాయూలు, వైఎస్సార్‌సీపీ ధర్నా
డీ ఎస్పీ హామీతో  ఆందోళన విరమణ
 

నగరి: నగరి పట్టణంలో సోమవారం టీడీపీ నాయకులు వీరంగం సృష్టిం చారు. మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్న టీడీపీ వర్గీయులు తీవ్రస్థాయిలో రెచ్చిపోయూరు. కార్యాలయంలో అధికారులు, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. అక్కడే ఉన్న మహిళా కౌన్సిలర్లు పుష్ప, గౌరీ చైర్‌పర్సన్‌కు సమాచారం అందించారు. దాంతో మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త మాజీ చైర్మన్ కేజే కుమార్‌తో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కెమెరాల ధ్వంసం విషయమై విచారిస్తుండగా ఆమెతోనూ ఘర్షణకుదిగి గాయపరిచారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్దే   ఇరుపార్టీల వారు అధిక సంఖ్యలో గుమికూడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మా రింది.

పలువురు వ్యాపారులు దుకాణాలు మూసేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న నగరి, పుత్తూరు సీఐలు నాగరాజ్, సాయినాథ్‌లు అధిక సంఖ్యలో పోలీసుల బలగాలను రప్పించారు. ఇరువర్గాలవారిని దూరంగా పంపి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. అరుుతే తమకు పోలీసులపై నమ్మకం లేదని, న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చైర్‌పర్సన్‌తో కలిసి బైఠాయించి ధర్నా చేశారు.

కన్నీళ్లు పెట్టుకున్న చైర్‌పర్సన్

చైర్‌పర్సన్ అయిన తనకే మున్సిపల్ కార్యాలయంలో రక్షణ లేకుండా పోయిందని శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి తోడ్పడాల్సిన తెలుగుదేశం పార్టీవారు ఇలా ప్రవర్తించడం అత్యంత బాధాకరమన్నారు. రాజ్యాంగంలో మహిళలకు పదవులు కల్పించారు కానీ వారికి రక్షణ కల్పించే విషయంలో చట్టాలు లేవన్నారు. తనతో పాటు మహి ళా కౌన్సిలర్లు  పుష్ప, గౌరీపై కూడా దాడికి పాల్పడిన వారిలో టీడీపీకి చెం దిన అమృతరాజ్, మైకెల్‌రాజ్‌లే ముఖ్యులన్నారు. వారు పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని, వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. దాడికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నాగభూషణరావు హామీ ఇచ్చిన అనంతరం చైర్‌పర్సన్ శాంతిని వైద్యం కోసం నగరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఏఎస్పీ శేఖర్, డీఎస్పీ నాగభూషణ్‌రావులకు ఫిర్యాదు చేశారు

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement