వంతెన పైనుంచి కారు పల్టీ | car rolls on the bridge | Sakshi
Sakshi News home page

వంతెన పైనుంచి కారు పల్టీ

May 24 2015 8:15 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా ఎడ్లపాడు సమీపంలోని వంతెనపై నుంచి కారు పల్టీ కొట్టి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఎడ్లపాడు (గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా ఎడ్లపాడు సమీపంలోని వంతెనపై నుంచి కారు పల్టీ కొట్టి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 8 గంటలకు జరిగింది. వివరాలు.. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న కారు అదుపు తప్పి వంతెనపై నుంచి పల్టీ కొట్టింది.

ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి గుంటూరు కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులు గుంటూరు జిల్లా వేమూరు గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement