తుమ్మలపాలెం చెక్పోస్ట్ వద్ద బస్సు దగ్ధం | Bus burnt at Tummalapalem Checkpost | Sakshi
Sakshi News home page

తుమ్మలపాలెం చెక్పోస్ట్ వద్ద బస్సు దగ్ధం

Apr 23 2015 2:44 PM | Updated on Sep 3 2017 12:45 AM

తుమ్మలపాలెం చెక్పోస్ట్ వద్ద బస్సు దగ్ధం

తుమ్మలపాలెం చెక్పోస్ట్ వద్ద బస్సు దగ్ధం

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.

ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను ఇబ్రహీం పట్నంలోనే దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. మరమ్మతులు చేయిద్దామని తీసుకువెళుతుండగా, తుమ్మలపాలెం చెక్‌పోస్టు వద్దకు వచ్చేసరికి బస్సులో మంటలు చెలరేగాయి.

 వెంటనే డ్రైవర్, క్లీనర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరుగలేదు.  ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని క్షణాల్లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement