
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు.
అనంతరం చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వం వైఖరికి నిరసన తెలిపారు. ఆయన ఇంటి గేటు వద్ద కాపు జేఏసీ నాయకులు కూడా చెవిలో పువ్వులు పెట్టుకుని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, సతీమణి పద్మావతి, కుమారుడు గిరి, కోడలు సిరి, మనువరాలు భాగ్యలక్ష్మితో పాటు కాపు జేఏసీ నాయకులతో కలసి ముద్రగడ తన ఇంటి వద్ద కంచాల మోత కార్యక్రమాన్ని నిర్వహించారు.