విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి స్పీకర్ మధుసూదనాచారి | Brahmins contributed to the Speaker madhusudanachari | Sakshi
Sakshi News home page

విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి స్పీకర్ మధుసూదనాచారి

Apr 9 2015 12:28 AM | Updated on Aug 20 2018 6:47 PM

విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి  స్పీకర్ మధుసూదనాచారి - Sakshi

విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి స్పీకర్ మధుసూదనాచారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని తెలంగాణ శాసనసభ

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఏపీలోని విశాఖలో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయన  బుధవారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలసి గాజువాకలోని ఏపీ రాష్ర్ట విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి నాగులకొండ ఆశ్లేషాచారి ఇంటికి వచ్చారు.

ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ కుల పెద్దలు, స్థానిక నాయకులు స్పీకర్‌ను సత్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణులను ఐక్యం చేయడంతోపాటు వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ ఫెడరేషన్ ఏర్పాటుకు తాను కృషి చేస్తానని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement