జానకీదేవికి బీజేపీ నేతల నివాళి

BJP leader Ram Madhav mother passes away, Leaders Condolence - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ మాతృమూర్తి వారణాసి జానకీదేవి భౌతికకాయానికి పలువురు బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు...జానకీదేవి భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు.

కాగా జానకీదేవి బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా బీజేపీ నేత రాంమాధవ్‌ ..పెద్ద కుమారుడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం స్వస్థలం కాగా, మూడేళ్లుగా జానకీదేవి ఢిల్లీలో కుమారుడు రాంమాధవ్‌ వద్దే ఉంటున్నారు. రెండో కుమారుడు కిషోర్‌ అమెరికాలో ఇంజినీరు, కుమార్తె భారతి హైదరాబాద్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. జానకీదేవి 20ఏళ్లుగా బీజేపీలో చురుకైన పాత్ర పోషించారు.  మహిళా మోర్చా రాష్ట్ర విభాగంలో పలు పదవులు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top