సంఘ సంస్కర్త బసవేశ్వరుడి ధర్మసూత్రాలు, బోధనలు మానవాళికే ఆదర్శనీయమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున్‌ఖర్గే అన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: సంఘ సంస్కర్త బసవేశ్వరుడి ధర్మసూత్రాలు, బోధనలు మానవాళికే ఆదర్శనీయమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున్‌ఖర్గే అన్నారు. ఆయన ఫిలాసఫి కారల్‌మార్క్స్ కంటే గొప్పదని అభిప్రాయపడ్డారు. 800 ఏళ్ల క్రితం జన్మించిన బసవేశ్వరుడు సమాజంలో ధర్మ, శాంతిస్థాపనకు కృషిచేశారని కొనియాడారు.
జిల్లా కేం ద్రంలోని పద్మావతికాలనీలో ప్రతిష్ఠిం చిన బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఆదివారం మల్లికార్జున్‌ఖర్గే ఆవిష్కరిం చారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రసంగించారు. బసవేశ్వరుడి బోధనలు, ధర్మసూత్రాలు ప్రపంచమంతా విస్తరి స్తే శాంతి, సమానత్వం నెలకొంటుం దన్నారు. ఆయన ధర్మసూత్రాలు, బో ధనలు ప్రచారంలోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. బసవేశ్వరుడి బోధనలను కొంతమంది పాదయాత్ర ద్వారా ప్రచారం చేశారని చెప్పారు. బసవేశ్వరుడు పనియే ప్రత్యక్ష దైవమని చెప్పారని గుర్తుచేశారు. మనిషి పనిలో శ్రద్ధాసక్తులు చూపిస్తే ఆర్థికపరంగా వృద్ధిలోకి వస్తాడని బోధించార ని కేంద్రమంది మల్లికార్జునఖర్గే చెప్పారు. బసవేశ్వరుడి తత్వం, ఆదర్శాల గురించి ప్రజలను తెలియడానికే విగ్రహాలను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. బసవేశ్వరుడి ఆదర్శాలు, ధర్మసూత్రాలు, బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.
తెలంగాణ ఆకాంక్ష ఫలిస్తుంది
తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష ఫలి స్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున్ ఖర్గే అన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు కోసం ప్ర త్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వెల్లడించారు. 2004, 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఇస్తున్నట్లు సోనియా చెప్పారని పేర్కొన్నా రు. తెలంగాణ బిల్లును కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. దేశంలోని చాలా రాజకీయపార్టీలు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు న్యా యం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సందర్భంగా ఆచార్య ముదిగొండ శివప్రసాద్ చేసిన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో గురుగంగాధర శివాచార్య మహాస్వాములు, బసవప్రభు కేతేశ్వర మహాస్వామీజీ, ము రుగ రాజేంద్ర మహాస్వామీజీ, సిద్ధలింగస్వామి, మంత్రి డీకే అరుణ, ఎ మ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ కె.వీరారెడ్డి, జేసీ ఎల్.శర్మన్, ఏజేజీ రాజారాం, మాజీ ఎమ్మెల్యే మల్లురవి, డీసీసీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, బుర్రి వెంకట్రామ్‌రెడ్డి, కేఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.