కలెక్టరేట్ వద్ద బీసీ సంఘాల ధర్నా | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ వద్ద బీసీ సంఘాల ధర్నా

Published Fri, Feb 5 2016 12:55 AM

కలెక్టరేట్ వద్ద బీసీ సంఘాల ధర్నా - Sakshi

 శ్రీకాకుళం టౌన్ : కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబి తాలో చేర్చాలంటూ సాగుతున్న ఉద్యమానికి వ్యతిరేకంగా  బీసీ సంఘాలు గళం విప్పాయి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో కాపులను బీసీలో చేరిస్తే ప్రస్తుతం ఉన్న కోటాను పెంచాలని లేకుంటే ప్రస్తుతం బీసీల జాబితాలో ఉన్న కులాలకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 2004నాటికి బీసీల జాబితాలో 94 కులాలు చేరిస్తే ఇప్పుడు 160 కులాలు అందులో చేరాయని,  రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా కొత్తగా కులాలు చేరడం వల్ల బీసీల్లో పోటీ పెరిగి రిజర్వేషన్ పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఉన్న 27శాతం రిజర్వేషన్ మాత్రమే బీసీ ఉప కులాలకు రిజర్వేషన్ కల్పిస్తుండడం వల్ల ప్రయోజనం పొందలేక పోతున్నామన్నారు. రిజర్వేషన్ శాతాన్ని 50కి పెంచి మరికొన్ని కులాలు చేర్చినా ఇబ్బంది ఉండదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఉప కులాలను దెబ్బతీసే విధంగా బలమైన సామాజిక వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చడం వల్ల అన్యాయం జరుగుతుందన్న ఆందోళనబీసీ వర్గాల్లో ఉందని చెప్పారు. ధర్నాలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.పి.దేవ్, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి బోయిన గోవిందరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement