ఇక నుంచి మా ఇంటి మహాలక్ష్మి..... | Bangaru talli Scheme now Ma Inti Mahalakshmi, saya minister kimidi mrunalini | Sakshi
Sakshi News home page

ఇక నుంచి మా ఇంటి మహాలక్ష్మి.....

Sep 6 2014 11:51 AM | Updated on Aug 18 2018 5:15 PM

నిరుపేద కుటుంబాల్లో పుట్టిన ఆడ పిల్లల కోసం నిర్దేశించిన బంగారు తల్లి పథకం పేరు మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

హైదరాబాద్ : నిరుపేద కుటుంబాల్లో పుట్టిన ఆడ పిల్లల కోసం నిర్దేశించిన బంగారు తల్లి పథకం పేరు మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని ఇక నుంచి 'మా ఇంటి మహాలక్ష్మి' గా పిలుస్తామని గ్రామీణాభివృద్ధి మంత్రి కిమిడి మృణాళిని శనివారం శాసనసభలో వెల్లడించారు. ఈ పథకంలో తొలి విడత చెల్లింపులు జరిగాయని.. ఈ పథకాన్ని సమర్ధంగా అమలు చేస్తామని ఆమె చెప్పారు.

 

ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు తగిన నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల్లో టాయిలెట్ల కొరత, మంచినీటి కొరతను వైఎస్ఆర్ సీపీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి తదితరులు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement