
గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా ఒక కళాకారుడు పెన్సిల్ ముల్లుపై షిర్డీసాయిబాబాను చెక్కాడు. కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన లంక వీరభద్రం అనే కళాకారుడు పెయింటింగ్స్ వేస్తాడు, సుద్దముక్కలు, సబ్బులపై బొమ్మలు చెక్కుతాడు. ఇటీవలే పెన్సిల్ ముల్లుపై వరల్డ్‌కప్ తదితర చిత్రాలను కూడా తీర్చిదిద్దాడు. మంగళవారం గురుపౌర్ణమి సందర్భంగా పెన్సిల్ ముల్లుపై సాయిబాబా రూపాన్ని చెక్కి భక్తిని చాటుకున్నాడు.