'టీడీపీ ప్రభుత్వం వేసిన కమిటీలు దగుల్బాజీ కమిటీలు' | AP PCC President Raghuveera Reddy fires on TDP Government | Sakshi
Sakshi News home page

'టీడీపీ ప్రభుత్వం వేసిన కమిటీలు దగుల్బాజీ కమిటీలు'

Jul 19 2015 11:34 AM | Updated on Aug 18 2018 9:05 PM

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వేసిన కమిటీలు దగుల్బాజీ కమిటీలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘు వీరారెడ్డి అన్నారు.

చిత్తూరు (బి. కొత్తకోట) : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వేసిన కమిటీలు దగుల్బాజీ కమిటీలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘు వీరారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలంలోని హార్స్లీ హిల్స్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు.

పుష్కరాల్లో రూ.1600 కోట్ల అవినీతి జరిగిందని, దానిపై సీఎం ఎందుకు నోరు మెదపటం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రచార యావతోనే తొక్కిసలాట జరిగిందని ఆయన విమర్శించారు. పుష్కరాల్లో ప్రభుత్వ అవినీతిపై త్వరలో న్యాయ పోరాటం చేస్తామని రఘువీరా రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement