దేవాలయాల పాలక మండళ్ల ఏర్పాటుకు కసరత్తు | andhra pradesh government decides to form committees for temples | Sakshi
Sakshi News home page

దేవాలయాల పాలక మండళ్ల ఏర్పాటుకు కసరత్తు

Oct 18 2014 9:19 PM | Updated on Jun 2 2018 2:36 PM

ఆంధ్రప్రదేశ్లో టీటీడీ మినహా మిగిలిన దేవాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో టీటీడీ మినహా మిగిలిన దేవాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. కోటి నుంచి 20 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దేవాలయాలకు పాలక మండళ్ల నియమకానికి నిర్ణయం తీసుకుంది.

5 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దేవాలయాలకు 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే 5 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఆదాయమున్న దేవాలయాలకు 11 మందితో,  20 కోట్ల రూపాయలపైగా ఆదాయమున్న దేవాలయాలకు 15 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement