అసెంబ్లీ భవనం మార్పుకు తాను ఒప్పుకోలేదని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు.
హైదరాబాద్ : అసెంబ్లీ భవనం మార్పుకు తాను ఒప్పుకోలేదని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఏపీ అసెంబ్లీలో సదుపాయాలు లేవన్నది వాస్తవమని ఆయన శుక్రవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. మర్యాదపూర్వకంగానే తెలంగాణ స్పీకర్ను కలిసినట్లు కోడెల తెలిపారు. స్టాండింగ్ కమిటీలను కొనసాగించే విషయమై పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. మొత్తం 98మంది తొలిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారని కోడెల తెలిపారు. 175మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.