క్రీడా హబ్‌గా ఆంధ్రప్రదేశ్ | Sakshi
Sakshi News home page

క్రీడా హబ్‌గా ఆంధ్రప్రదేశ్

Published Mon, Aug 31 2015 3:36 AM

క్రీడా హబ్‌గా ఆంధ్రప్రదేశ్ - Sakshi

మంత్రి అచ్చెన్నాయుడు
 
 రామగిరి : రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడల శాఖామంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మండల కేంద్రమైన రామగిరిలో రూ.2.10 కోట్లతో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ ఇండోర్ స్టేడియాన్ని ఆదివారం జిల్లా మంత్రులు పరి టాల సునీత, పల్లె రఘనాథరెడ్డి, శాప్ చై ర్మన్ మోహన్, ఆర్డీటీ సంస్థ చైర్మన్ మంచో ఫైతో కలిసి ప్రారంభించారు. క్రికెట్ ఆడి ఆటల పోటీలు ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పదేళ్లలో క్రీడల్లో రాష్ట్రం పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడా మైదానా లు అభివృద్ధి చేస్తామన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌కు అవగాహన లేదన్నారు. పోలవ రం ముంపులోనున్న ఏడు మండలాల ను ఆంధ్రాలోకి కలుపుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మం త్రులు పల్లె రఘనాథరెడ్డి, సునీత ప్రసంగించారు. మంత్రుల చేతుల మీదుగా కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు. జేసీ లక్ష్మికాంతం, ఏజేసీ ఖాజామొహీద్దీన్, మేయర్ స్వరూప పాల్గొన్నారు.

Advertisement
Advertisement