జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారిణి సలుమూరి క్రాంతి అంతర్జాతీయ స్థాయిలో రాణించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గత నెలలో జరిగిన కబడ్డీ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర మహిళా జట్టు తరుపున ఆడి గోల్డ్‌మెడల్ సాధిం చింది. ఆమెకు శిక్షణ ఇస్తున్న కానిస్టేబుల్ నాగు గురువారం గణపవరంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు
గణపవరం, న్యూస్‌లైన్ :
జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారిణి సలుమూరి క్రాంతి అంతర్జాతీయ స్థాయిలో రాణించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గత నెలలో జరిగిన కబడ్డీ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర మహిళా జట్టు తరుపున ఆడి గోల్డ్‌మెడల్ సాధిం చింది. ఆమెకు శిక్షణ ఇస్తున్న కానిస్టేబుల్ నాగు గురువారం గణపవరంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గతంలో గణపవరం డిగ్రీ కళాశాలలో జిల్లా జట్టులో ఎంపిక కోసం శిక్షణ పొందిన క్రాంతి ప్రస్తుతం గోపన్నపాలెం వ్యాయామ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. 2009లో జమ్మూకాశ్మీర్‌లో జరిగిన సబ్ జూని యర్ జాతీయ స్థాయి పోటీల్లో, 2012లో ఆంధ్రాయూనివర్సిటీ తరుపున తమిళనాడులో జరిగిన పోటీలో గోల్డ్‌మెడల్ సాధించిందన్నారు. ఇప్పటివరకు ఇత ర దేశాలలో జరిగిన పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన కబడ్డీ క్రీడాకారిణి జిల్లాలో సలుమూరి క్రాంతి ఒక్కరేనని పేర్కొన్నారు.
మాది నిరుపేద కుటుంబం
అనంతరం క్రీడాకారిణి క్రాంతి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తమది నిరుపేద కుటుంబమని, తండ్రి చిన్నతనంలోనే చనిపోయారన్నారు. తాము ముగ్గురు ఆడపిల్లలమని, తల్లి వ్యవసాయ కూలీ అని, తాను రెండవ కుమార్తెనని పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున పోటీలకు ఇతర దేశాలు, రాష్ట్రాలు వెళ్లాలంటే వ్యయంతో కూడుకున్నదన్నారు. దాతల సహకారంతో తాను ఈ స్థాయికి వచ్చానన్నారు. తనకు ఆర్థిక సహాయం అందించిన దాతలు కాకర్ల శ్రీనుకు, పీవీ ప్రసాదరాజు, నంద్యాల శేఖర్‌రాజు, చేబ్రోలు మాజీ సర్పంచ్ రామభద్రిరాజులకు, క్రీడారంగంలో ప్రోత్సహించిన జిల్లా కబడ్డీ జట్టు అధ్యక్షుడు ఎం.రంగారావు, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ సంఘ కార్యదర్శి వి.వీర్ల అంకయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు.