ఆపద్బాంధవుడికి కృతజ్ఞతగా..

AgriGold Victims Milk Abhishekam To YS Jagan Photo - Sakshi

రణస్థలం: అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు రూ.265 కోట్లు విడుదల చేసిన సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర సమయంలో ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర నుంచి చూశారు, రైతుల అకలి బాధలను తెలుసుకున్నారు, అగ్రిగోల్డ్‌ బాధితుల గొడును విన్నారు.. నేడు అధికారంలోని వచ్చిన అనతికాలంలోనే ఒక్కొక్కటిగా పరిష్కారిస్తున్నారన్నారు. రూ.10 వేల లోపు ఉన్న డిపాజిట్లు చెల్లించడం పేదలకు శుభపరిణామని కొనియాడారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే రూ.1150 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల పక్షాన నిలిచిందన్నారు. ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు నిర్వ హించామన్నారు. దీనికి బయపడిన చంద్రబాబు అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాలు సేకరించినా.. డిపాజిట్లు చెల్లించడంలో విఫలమైయ్యా రని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్‌సీపీ నాయకులు పిన్నింటి సాయికుమా ర్, ఎల్‌.శ్రీనివాసరావు, పచ్చిగుళ్ల సాయిరాం, దన్నాన సీతారాం, ఆర్‌.ఎస్‌.రెడ్డి, జనార్దన్, జైనీ లక్ష్మణ, రెడ్డి అప్పలనాయుడు, బెండు రామరావు, అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు వి.వి.రామకృష్ణ, సి.హెచ్‌.శ్రీనివాసరావు, కరిమజ్జి నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

మాటకు కట్టుబడిన వ్యక్తిగా..
టెక్కలి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి అని, పాదయాత్రలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు మొదట విడతగా రూ.264.99 కోట్ల నిధులను విడుదల చేశారని వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. శనివారం టెక్కలిలోని తన స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 45,833 మంది డిపాజిటర్లు ఉన్నారని, వారికి రూ. 31,41,59,741లు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. పేద, సామాన్య వర్గాల ప్రజలు వారి  అవసరాల కోసం అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసుకుంటే, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ కలిసి ఆ డబ్బులను దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కుల, మత, రాజకీయ విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఇందులో నాటి మంత్రి అచ్చెన్నాయుడుకు పెద్ద ఎత్తున కమీషన్లు ముట్టా యని ఆరోపించారు. జిల్లాలో రౌడీ రాజకీయాలు కింజ రాపు కుటుంబంలోనే ఆరంభమయ్యా యని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలన్నారు. ఇప్పటికైనా పారదర్శక పాలనకు సహకరించకపోతే భవిష్యత్‌లో టీడీపీ పూర్తిగా గల్లంతు కావడం ఖాయమన్నారు.  

అధికారంలోకి రాగానే ఆదుకున్నారు ..
టెక్కలి: తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్సార్‌ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రూ.264.99 కోట్లు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. శనివారం టెక్కలి వైఎస్సార్‌ సీపీ కార్యాలయం వద్ద సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.  వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బి.గౌరీపతి, బగాది హరి, బి.ఉదయ్, చిన్ని జోగారావు, జి.గురునాథ్‌ యాదవ్, కురమాన కృష్ణారావు, శంకర్, శ్యామలరావు, మదీన్, పి.రమణ, కె.నారాయణమూర్తి, ఎం.భాస్కర్, పి.వెంకటరావు, జె.జయరాం, బి.తులసీ, యర్రన్న తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top