వరంగల్‌లో అదృశ్యం.. ఖమ్మంలో మృత్యువాత | A gift of the invisible .. Khammam killed | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో అదృశ్యం.. ఖమ్మంలో మృత్యువాత

Oct 21 2013 2:41 AM | Updated on Sep 1 2017 11:49 PM

వరంగల్‌లో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఓ బాలిక ఖమ్మం పట్టణంలోని గోపాలపురం ఎల్‌బీనగర్ వద్ద సాగర్‌కాల్వలో మృతదేహమై కనిపించింది.

ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్ :  వరంగల్‌లో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఓ బాలిక ఖమ్మం పట్టణంలోని గోపాలపురం ఎల్‌బీనగర్ వద్ద సాగర్‌కాల్వలో మృతదేహమై కనిపించింది. శుక్రవారం కాల్వలో తేలిన బాలిక  వివరాలు ఆది వారం లభ్యమయ్యాయి. మృతురాలు వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్‌స్టేషన్ ఏఎస్సై సోమ కుమారస్వామి కూతురు సునీత(15)గా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. సోమ కుమారస్వామికి ముగ్గురు కూతుళ్లు ఉ న్నారు.

రెండో కూతురు సునీత వరంగల్  దేశాయిపేటరోడ్డులోని సంఘమిత్ర పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 17న మధ్యాహ్నం ఇంటి వద్దే ఉన్న సునీత బ జారుకెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుమారస్వామి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. ఇంట్లోని సెల్‌ఫోన్‌ను ఆమె తీసుకెళ్లడంతో ఆ నంబర్ అధారంగా టవర్ ఏరియాను పరిశీలిస్తే ఖమ్మంలోని కాల్వొడ్డు పరిసరాల్లో ఉన్నట్లు తేలింది. దీంతో తం డ్రి కుమారస్వామితోపాటు మట్టెవాడ పోలీసులు శనివారం ఖమ్మం వచ్చి ఆరా తీశారు.

శనివారం మధ్యాహ్నం వరకు టవర్ ఏరియా చూపిం చిన ఫోన్ తర్వాత  సిగ్నల్ లేకుండా పోయింది. అర్ధరాత్రి వరకూ ఆరా తీసిన పో లీసులు, మృతురాలి తండ్రి ఒక లాడ్జీ లో బస చేశారు. ఆదివారం ఉదయం వారు దినపత్రికలను పరిశీలించగా గుర్తుతెలియని మృతదేహం అనే వార్త కనిపించింది. ఫొటో ఆధారంగా మృతురాలు సునీతగా గుర్తించి ఖమ్మం అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం ఖమ్మం మార్చురీలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనపర్చుకున్నారు.
 
హత్యా ? ఆత్మహత్యా ?

 సునీత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఆమెను ఎవరైనా హత్య చేసి సాగర్ కాల్వలో పడేశారా.. లేక ఆమె ఆత్మహ త్య చేసుకుందా.. అనేది మిస్టరీగా మారింది. సునీత సెల్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా మట్టెవాడ పోలీసులు ఫోన్ చేశారు. తన పేరు చరణ్ అంటూ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మాచినపేటకు చెందిన యువకుడు పోలీసులతో మాట్లాడాడు. అయితే సిమ్ కొనుగోలు చేసిన వ్యక్తి అడ్రస్‌ను పరిశీలిస్తే వీరునాయక్‌దిగా ఉందని మట్టెవాడ పోలీసులు ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. ఆ తర్వాత సెల్‌ఫోన్ శనివారం మధ్యాహ్నం నుంచి స్విచాఫ్ చేసి ఉందని తెలిపారు.

రెండు నెలలుగా కొత్త వ్యక్తులతో సునీత ఫోన్‌లో మాట్లాడేదని బంధువులు తెలిపారు. వారే మాయమాటలు  చెప్పి ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి ఈ ఆఘాయిత్యానికి పాల్ప డి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సాగర్‌కాల్వలో  మృతదేహం లభ్యమైన రోజు  నోటి నుంచి నురుగులు వచ్చాయని, మోకాలికి గాయం కూడా ఉందని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement