breaking news
Tower Area
-
ఇక ఎక్కడికైనా హలో హలో!
హిమాలయాల్లోని చొరరాని అతి శీతల ప్రాంతాలు. రాజస్తాన్ థార్ ఎడారిలోని అతి మారుమూల మంచు దిబ్బలు. మధ్యప్రదేశ్ లోని దట్టమైన అటవీ ప్రాంతం. సుదూర సాగర జలాలు. ఇలా టవర్ కనెక్టివిటీ ఊసే ఉండని ప్రాంతాల్లో కూడా త్వరలో మొబైల్ మోగనుంది. అలాంటి ప్రాంతాలకు కూడా మొబైల్ కనెక్టివిటీ అందించే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నడుం బిగించింది. ఇందుకు వీలు కల్పించే బ్లూ బర్డ్ బ్లాక్2 ఉపగ్రహాన్ని బుధవారం ప్రయోగించనుంది. ఈ రంగంలో విశేష అనుభవమున్న అమెరికాకు చెందిన ప్రసిద్ధ ప్రైవేట్ కంపెనీ ఏఎస్టీ స్పేస్ మొబైల్ ఈ ఉపగ్రహాన్ని తయారు చేయడం విశేషం. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం బ్లూ బర్డ్ బ్లాక్2 ప్రయోగం జరగనుంది. ఇందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇస్రో బాహుబలిగా పేరొందిన లాంచ్ వెహికల్ మార్క్ (ఎల్ఎంవీ3–ఏం6) వాహక నౌక ఉదయం 8:54 గంటలకు ఉపగ్రహంతో నింగిలోకి దూసుకుపోనుంది. ఈ వాహక నౌకకు ఇది 9వ మిషన్. ఇక ఇస్రో ఇది ఏకంగా 101వ ఉపగ్రహ ప్రయోగం కానుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత టెలికమ్యూనికేషన్స్ రంగంలోనే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి.భూ కక్ష్యలో పెద్ద యాంటెన్నాబ్లూ బర్డ్ బ్లాక్2 ఉపగ్రహం ప్రత్యేకతలు ఇన్నీ అన్నీ కావు. అది అందించే సేవలూ విశేషమైనవే...→ ఈ ఉపగ్రహం బరువు ఏకంగా 6,100 కిలోలు! భారత్ నుంచి ఇప్పటిదాకా ప్రయోగించిన అత్యంత బరువైన పేలోడ్ గా ఇది రికార్డుకెక్కనుంది.→ సాధారణ స్మార్ట్ ఫోన్లన్నీ దీని సేవలను నేరుగా పొందవచ్చు. ప్రత్యేకమైన హార్డ్ వేర్ గానీ, అదనపు యాంటెన్నా వంటివాటి అవసరం ఎంతమాత్రమూ ఉండదు.→ మారుమూలల్లో మాత్రమే కాదు, సంప్రదాయ సెల్ సిగ్నల్స్ అందుబాటులో ఉందని విమాన ప్రయాణాలు తదితర చోట్ల కూడా ఇది భేషుగ్గా సేవలు అందించగలదు.→ బ్లూ బర్డ్ బ్లాక్2 భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించిన మీదట అక్కడ ఏకంగా 223 చదరపు మీటర్ల విస్తీర్ణంతో కూడిన యాంటెన్నాను ఉపగ్రహం ఏర్పాటు చేయనుంది.→ అక్కడ మోహరించిన అతి పెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్స్ యాంటెన్నాగా ఇది రికార్డు సృష్టించనుంది.→ బ్లూ బర్డ్ బ్లాక్2ను రూపొందించిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీకి ఈ రంగంలో విశేషమైన అనుభవముంది.→ బ్లూ బర్డ్ ఉపగ్రహాల ద్వారా అమెరికాలో అన్ని మారుమూల ప్రాంతాలకూ మొబైల్ సేవల విస్తరణలో నాసాకు ఈ కంపెనీ దోహదపడింది.→ గత బ్లూ బర్డ్ ఉపగ్రహాలతో పోలిస్తే ఏకంగా 10 రెట్లు ఎక్కువ బ్యాండ్ విడ్త్ అందించే సామర్థ్యంతో బ్లాక్2ను రూపొందించడం విశేషం.→ సెకనుకు 120 మెగాబైట్ల వేగంతో మొబైల్ సేవలు అందుతాయి.→ 4జీ, 5జీ నెట్ వర్కులు రెండింట్లోనూ వాయిస్ కాల్స్, మెసేజింగ్, డేటా మార్పిడితో పాటు అంతరాయం లేని వీడియో స్ట్రీమింగ్ సాధ్యపడుతుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వరంగల్‌లో అదృశ్యం.. ఖమ్మంలో మృత్యువాత
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్ : వరంగల్‌లో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఓ బాలిక ఖమ్మం పట్టణంలోని గోపాలపురం ఎల్బీనగర్ వద్ద సాగర్‌కాల్వలో మృతదేహమై కనిపించింది. శుక్రవారం కాల్వలో తేలిన బాలిక వివరాలు ఆది వారం లభ్యమయ్యాయి. మృతురాలు వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్‌స్టేషన్ ఏఎస్సై సోమ కుమారస్వామి కూతురు సునీత(15)గా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. సోమ కుమారస్వామికి ముగ్గురు కూతుళ్లు ఉ న్నారు. రెండో కూతురు సునీత వరంగల్ దేశాయిపేటరోడ్డులోని సంఘమిత్ర పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 17న మధ్యాహ్నం ఇంటి వద్దే ఉన్న సునీత బ జారుకెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుమారస్వామి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. ఇంట్లోని సెల్‌ఫోన్‌ను ఆమె తీసుకెళ్లడంతో ఆ నంబర్ అధారంగా టవర్ ఏరియాను పరిశీలిస్తే ఖమ్మంలోని కాల్వొడ్డు పరిసరాల్లో ఉన్నట్లు తేలింది. దీంతో తం డ్రి కుమారస్వామితోపాటు మట్టెవాడ పోలీసులు శనివారం ఖమ్మం వచ్చి ఆరా తీశారు. శనివారం మధ్యాహ్నం వరకు టవర్ ఏరియా చూపిం చిన ఫోన్ తర్వాత సిగ్నల్ లేకుండా పోయింది. అర్ధరాత్రి వరకూ ఆరా తీసిన పో లీసులు, మృతురాలి తండ్రి ఒక లాడ్జీ లో బస చేశారు. ఆదివారం ఉదయం వారు దినపత్రికలను పరిశీలించగా గుర్తుతెలియని మృతదేహం అనే వార్త కనిపించింది. ఫొటో ఆధారంగా మృతురాలు సునీతగా గుర్తించి ఖమ్మం అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం ఖమ్మం మార్చురీలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనపర్చుకున్నారు. హత్యా ? ఆత్మహత్యా ? సునీత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ఎవరైనా హత్య చేసి సాగర్ కాల్వలో పడేశారా.. లేక ఆమె ఆత్మహ త్య చేసుకుందా.. అనేది మిస్టరీగా మారింది. సునీత సెల్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా మట్టెవాడ పోలీసులు ఫోన్ చేశారు. తన పేరు చరణ్ అంటూ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మాచినపేటకు చెందిన యువకుడు పోలీసులతో మాట్లాడాడు. అయితే సిమ్ కొనుగోలు చేసిన వ్యక్తి అడ్రస్‌ను పరిశీలిస్తే వీరునాయక్దిగా ఉందని మట్టెవాడ పోలీసులు ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. ఆ తర్వాత సెల్‌ఫోన్ శనివారం మధ్యాహ్నం నుంచి స్విచాఫ్ చేసి ఉందని తెలిపారు. రెండు నెలలుగా కొత్త వ్యక్తులతో సునీత ఫోన్లో మాట్లాడేదని బంధువులు తెలిపారు. వారే మాయమాటలు చెప్పి ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి ఈ ఆఘాయిత్యానికి పాల్ప డి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సాగర్‌కాల్వలో మృతదేహం లభ్యమైన రోజు నోటి నుంచి నురుగులు వచ్చాయని, మోకాలికి గాయం కూడా ఉందని పోలీసులు తెలిపారు.


