ఆటోలు ఢీ: ఐదుగురికి గాయాలు | 5 injured in 2 auto's collisioned incident | Sakshi
Sakshi News home page

ఆటోలు ఢీ: ఐదుగురికి గాయాలు

Sep 27 2015 9:29 PM | Updated on Sep 3 2017 10:05 AM

ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానిని మరోకటి ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

అనంతగిరి(విశాఖపట్నం): ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానిని మరోకటి ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విశాఖపట్నం జిలా అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా మామిడిపల్లెకు చెందిన వారు అరకలోయ మండలంలోని సుంకరమెట్ట సంతకు వెళ్లి వస్తుండగా అనంతగిరి మండలంలోని మూలిగూడ వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను మరో ఆటో ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement