రెండు బైకులు ఢీ: నలుగురికి గాయాలు | 4 injured in bike accident | Sakshi
Sakshi News home page

రెండు బైకులు ఢీ: నలుగురికి గాయాలు

Aug 13 2015 12:12 PM | Updated on Aug 30 2018 3:56 PM

వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

లక్కిరెడ్డిపల్లి: వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని లక్కిరెడ్డి పల్లి మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండల కేంద్రం శివారులో ఎదురుగా వస్తున్న సుమోను తప్పించబోయి ఓ బైకు మరో బైకును ఢీకొట్టింది. దీంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారు కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు రామాపురం మండలం నీలకంఠపురం వాసులని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement