సమస్యలు పరిష్కరించాలని 108 కాంట్రాక్టు ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం 29వ రోజుకు చేరింది. వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే దీక్షల్లో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : సమస్యలు పరిష్కరించాలని 108 కాంట్రాక్టు ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం 29వ రోజుకు చేరింది. వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే దీక్షల్లో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ప్రభుత్వం ఈఎంఆర్‌ఐ, జీవీకే యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
సమ్మె చేస్తున్న ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే 360 మంది ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంగా నెలకు రూ.15వేల వేతనం, ఎనిమిది గంటల పనిదినం, 108 సర్వీస్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గణేశ్, నాయకులు సతీష్, నర్సారెడ్డి, నవీన్, రాజన్న, సాగర్, భోజన్న, వసీం, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.