
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా (చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్–సీఈవో) రామ్ ప్రకాశ్ సిసోడియాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజుల క్రితమే ఐఏఎస్ సీనియర్ అధికారి అయిన సిసోడియాను రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్‌గా నియమించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
సిసోడియా ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. తాజా ఉత్తర్వులతో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటారు.