సాక్షి, హైదరాబాద్: కవాడిగూడలో దారుణం జరిగింది. రత్నదీప్ నాలుగో అంతస్థులో నివసిస్తున్న భార్యను ఆమె భర్త అత్యంత కిరాతకంగా పొడిచి చంపాడు. భార్య చనిపోయిందని నిర్ణయించుకున్నాక అక్కడి నుండి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ హత్య ఎందుకు జరిగింది? భార్య, భర్త మధ్య ఏమైనా గొడవలున్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.


