Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 19వ సీజన్‌లో మంగళవారం జైపూర్ వేదికగా 64వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి.
మరో వికెట్..
లక్నో మరో వికెట్ కోల్పోయింది. యశ్‌రాజ్ బౌలింగ్‌లో ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి నికోలస్ పూరన్ (16) ఔటయ్యాడు. స్కోరు 13 ఓవర్లకు 156-2గా ఉంది.
12 ఓవర్లలో స్కోరు 151-1
లక్నో స‍్కోరు 12 ఓవర్లలో 151-1గా ఉంది. మార్ష్ హాఫ్ సెంచరీ బాదాడు. ప్రస్తుతం మార్ష్ 67, నికోలస్ పూరన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న లక్నో 109 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జోస్ ఇంగ్లిస్ (29 బంతుల్లో 60) యష్ రాజ్ పుంజా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 9 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. మార్ష్ (46), పూరన్ (7) పరుగులతో ఆడుతున్నారు.
8 ఓవర్లలో రాజస్తాన్ 105/0
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ధాటిగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఇంగ్లిస్ (56), మార్ష్ (46) పరుగులతో ఆడుతున్నారు.
6 ఓవర్లలో రాజస్తాన్ 83/0
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ధాటిగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. ఇంగ్లిస్ (49), మార్ష్ (31) పరుగులతో ఆడుతున్నారు.
3 ఓవర్లలో రాజస్తాన్ 38/0
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (20), మిచెల్ మార్ష్ (15) పరుగులతో ఆడుతున్నారు.
టాస్ గెలిచిన రాజస్తాన్
టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ పరాగ్ దూరం కావడంతో జైస్వాల్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మ్యాచ్‌కు రాజస్తాన్, లక్నో జట్లు చెరో మూడు మార్పులతో బరిలోకి దిగాయి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఏడుసార్లు తలపడితే రాజస్తాన్ ఐదుసార్లు, లక్నో రెండుసార్లు గెలుపొందాయి. చివరి మూడు మ్యాచ్‌లు చూసుకుంటే లక్నోదే పైచేయిగా ఉంది.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్ (కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, సుశాంత్ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.
🚨 Toss 🚨@rajasthanroyals have won the toss and elected to bowl first against @LucknowIPL
Yashasvi Jaiswal is leading #RR in the absence of injured Riyan Parag.#TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/kDsCjdWhIO— IndianPremierLeague (@IPL) May 19, 2026
ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు సంబంధించి మూడు బెర్తులు ఖరారు కాగా మిగిలి ఉన్న ఒకే బెర్తు కోసం ఐదు జట్లు (రాజస్తాన్, పంజాబ్, సీఎస్‌కే, ఢిల్లీ, కేకేఆర్) పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఐదింటిలో రాజస్తాన్ రాయల్స్‌కు ఎక్కువ అవకాశాలున్నాయి. తాము ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్ గెలిస్తే మాత్రం ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ఇవాళ లక్నోతో మ్యాచ్ రాజస్తాన్‌కు కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓడితే మాత్రం ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి.


