traitors
-
మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ముమ్మాటికీ ద్రోహులే
రాయ్‌బరేలీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ముమ్మాటికీ ద్రోహులు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారంతా కలిసి భారత రాజ్యాంగంపై నిత్యం దాడి చేస్తున్నారని, దేశ ప్రయోజనాలను కొంతమంది పారిశ్రామికవేత్తలకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ తన సొంత నియోజకర్గం రాయ్‌బరేలీలో రెండో రోజు బుధవారం కూడా పర్యటించారు. స్థానిక విప్లవవీరుడు ‘వీరా పాసీ’ సంస్మరణార్థం న్విహించిన బహుజన్ స్వాభిమాన్ సభలో ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మీ ఇళ్లకు వచ్చి మోదీ, అమిత్ షాల గురించి మాట్లాడితే నిలబడి గట్టిగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లు ద్రోహులేనని తేల్చిచెప్పాలని సూచించారు. రాజ్యాంగం, అంబేడ్కర్, గాం«దీజీలపై దాడి చేస్తూ దేశాన్ని అమ్మేస్తున్నవారు ద్రోహులు కాక ఇంకేమవుతారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, కుల గణన చేపట్టకుండా జాప్యం చేస్తూ, బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తూ రాజ్యాంగంపై నిత్యం 20 గంటలూ దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. త్వరలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహారం సహా అన్నింటి ధరలు ఎగబాకుతాయని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఎరువుల ధరలు సైతం పెరగడం తథ్యమని అన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా సామాన్య ప్రజలే నష్టపోతారని, అంబానీ, అదానీలపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. అంబానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి, దాన్ని విదేశాలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడని, ఆ సొమ్మును నరేంద్ర మోదీకి చేరవేస్తున్నాడని రాహుల్ ధ్వజమెత్తారు. రాబోయే సంక్షోభం నుంచి ప్రజలను ప్రభుత్వం కాపాడలేదని, దాని ప్రభావం రెండు మూడు నెలల్లో కనిపిస్తుందని అన్నారు. చమురు ధరల విషయంలో ప్రభుత్వం తప్పేమీ లేదని మోదీ అంటున్నారని ఆక్షేపించారు. కానీ, తప్పంతా మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లదని తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని రాహుల్ విమర్శించారు.‘అది నాయకత్వ లక్షణం కాదు.. గిమ్మిక్’ ప్రధాని మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలొనీకి మెలొడీ చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడంపై రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో స్పందించారు. ‘అది నాయకత్వ లక్షణం కాదు.. ఉత్తి గిమ్మిక్’ అని తేల్చిచెప్పారు. ఒకవైపు పెరిగిపోతున్న ఆర్థిక సంక్షోభాన్ని పట్టించుకోకుండా ఇటలీలో చాక్లెట్లు ఇస్తున్నారని మోదీపై మండిపడ్డారు. మన రైతులు, కార్మికులు, వ్యాపారులు కష్టాల్లో ఉంటే మోదీ మాత్రం నవ్వుతూ రీల్స్ చేస్తున్నారని, అది చూసి బీజేపీ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారని రాహుల్ విమర్శించారు. రాజకీయాల్లో ఆయన రాహువు బీజేపీ చీఫ్ నబీన్ మండిపాటున్యూఢిల్లీ: ప్రధాని మోదీ ద్రోహి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ మాటలు ఆయన అరాచక మనస్తత్వాన్ని, స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ధ్వజమెత్తారు. 140 కోట్ల మంది ప్రజలను దారుణంగా కించపర్చారని, రాహుల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బుధవారం డిమాండ్ చేశారు. భారత రాజకీయాల్లో రాహుల్ ఒక ‘రాహువు’అని ఆరోపించారు. ఆయన తన ఆలోచనా విధానంతో దేశ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని విమర్శించారు. వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుండడంతో అది తట్టుకోలేక నిరాశ, అసంతృప్తికి గురై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని, మానసిక సమతుల్యత కోల్పోతున్నారని రాహుల్‌పై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. -
ఓటీటీలో హనుమాన్ హీరో ఎంట్రీ.. ఏకంగా హోస్ట్‌గా ఛాన్స్..!
హనుమాన్ మూవీతో ఓ రేంజ్లో క్రేజ్ దక్కించకున్న టాలీవుడ్ తేజ సజ్జా. ఆ తర్వాత మిరాయ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేశాడు. తాజాగా ఈ యంగ్ హీరో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ ప్రకటించిన ప్రముఖ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గతంలో బాలీవుడ్లో సక్సెస్ అయిన ఈ షోను తెలుగులోనూ తీసుకొస్తున్నారు.అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న ‘ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోకు తేజ సజ్జా హోస్ట్‌గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఓటీటీలోనూ హనుమాన్ హీరో సందడి చేయనున్నాడు. ఇలాంటి ఇంటర్నేషనల్‌గా క్రేజ్ ఉన్న షోకి హోస్ట్‌గా వ్యవహరించడం వల్ల అతని క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ప్రైమ్ వీడియో ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్‌తో కలిసి తేజ సజ్జా వేదికపై సందడి చేశారు.ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన షో ట్రైటర్స్. ఈ షోలో కేవలం చాలా ఇంటలిజెన్స్‌తో ఉన్నవాళ్లు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ గ్లోబల్ షో తెలుగు వర్షన్ ప్రైమ్ వీడియోలో రానుంది రాబోతోంది. అయితే ఈ అప్ కమింగ్ షోకి మన టాలీవుడ్ యంగ్ స్టార్ తేజ హోస్ట్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. గతేడాది హిందీలో వచ్చిన ఈ ట్రైటర్స్ షోను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఈ రియాలిటీ షో జరగనుంది. -
నమ్మక ద్రోహుల ఓట్లు నాకు అక్కర్లేదు
పట్నా: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలుచేసే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి మైనారిటీలపై అనుచితంగా మాట్లాడారు. బిహార్‌లో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఆదివారం అర్వాల్ జిల్లాలో గిరిరాజ్ మాట్లాడారు. ‘‘ఒకసారి నేను మౌల్వి(ముస్లిం మతాధికారి)ని ఒక ప్రశ్న వేశా. మీకు కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యకార్డ్ ఉందా? అని అడిగితే ఉంది అని చెప్పారు. హిందూ–ముస్లిం ప్రాతిపదికన మాత్రమే ప్రభుత్వం ఈ కార్డ్‌లు ఇచ్చిందని భావిస్తున్నారా? అని అడిగితే లేదు అని సమాధానం చెప్పారు. మీకు నాకు ఓటేశారా? అంటే అవునన్నారు. మరి ఖుదా (దైవం) మీద ప్రమాణంచేసి నిజం చెప్పండి అంటే ఆయన చెప్పలేదు. ముస్లింలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ వాడుకుంటారు. వాటి ప్రయోజనాలు, లబ్ధి పొందుతారు. కానీ ఓటు మాత్రం మాకు వేయరు. ఇలాంటి వాళ్లనే నమ్మకద్రోహులు అంటారు. మీలాంటి వాళ్ల ఓటు నాకు వద్దు అని ఆయన ముఖం మీదనే చెప్పేశా’’ అని ర్యాలీలో గిరిరాజ్‌సింగ్ వెల్లడించారు. ‘‘బిహార్‌లో మొత్తం మౌలికసదుపాయాల కల్పనకు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో చేసింది. బిహార్‌లో రోడ్డు కేవలం ఎన్డీఏ నేతల కోసం వేయలేదు. మొత్తం ప్రజల కోసం వేశారు. ఇప్పుడు బిహార్ ఎంతో మారింది. సమాజంలోని ప్రతి వర్గం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది. అయినాసరే ముస్లింలు బీజేపీకి ఓటు వేయట్లేరు’’ అని ఆయన అన్నారు. మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ -
తన పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు: ఆశిష్ విద్యార్థి
పోకిరి మూవీతో తెలుగులో ఫేమస్ అయిన నటుడు ఆశిష్ విద్యార్థి. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్‌గా వచ్చిన ది ట్రైటర్స్ అనే రియాలిటీ షోకు పాల్గొన్న ఆయన.. ప్రముఖ ఇన్‌ఫ్లూయన్సర్ అపూర్వ ముఖిజా తనను అగౌరవపరిచేలా మాట్లాడారన్న కామెంట్స్‌పై స్పందించారు. ఆమెతో తన సంభాషణ చాలా ఉత్తేజకరంగా సాగిందని అభివర్ణించాడు. అయితే ఈ షో ముగిశాక తనకు ఆమె క్షమాపణలు చెప్పిందని ఆశిష్ విద్యార్థి తెలిపారు.ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.."ఆ షో ముగిసిన మరుసటి రోజే తను నాకు వాట్సాప్ సందేశం పంపింది. సర్, నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మేసేజ్ చేసింది. నేను వెంటనే ఆమెకు ఫోన్ చేసి అపూర్వ, నేను అక్కడ కూడా మీతో మాట్లాడాను. మీరు చాలా అద్భుతమైన మనిషి. అంతా బాగానే ఉందని చెప్పా. ఆ చర్చ పట్ల నేను సంతోషంగా ఉన్నా. ఆమె ఒక రోజు నాతో భోజనం చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. కుదిరితే భవిష్యత్తులో ఆమెతో కలిసి డిన్నర్ చేస్తా. తనపట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదని" వెల్లడించారు.కాగా.. ఆశిష్ విద్యార్థి ఇటీవల ‘ది సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఈ సిరీస్ ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇందులో రాజీవ్ ఖండేల్వాల్, సాయి తమంహర్కర్ కూడా నటించారు. -
Manchu Lakshmi: 20 మంది ప్రముఖులతో రియాలిటీ గేమ్ షో.. కంటెస్టెంట్‌గా మంచు లక్ష్మీ!
గతంలో కాఫీ విత్ కరణ్ షోతో ప్రముఖలను ఇంటర్వ్యూ చేసిన కరణ్ జోహార్ మరో రియాలిటీ షోతో ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన హోస్ట్‌గా వస్తోన్న రియాలిటీ గేమ్ షో 'ది ట్రైటర్స్'. ఈ షోలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది నటులు కూడా ఉండడం ఈ షోపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ షోలోనే పాల్గొనే వారి పేర్లను రివీల్ చేశారు. అంతేకాకుండా ఈ రియాలిటీ షో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.ఈ రియాలిటీ షోలో దాదాపు 20 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. ఈ గేమ్ షోలో ఊహించని మలుపులు, హై-వోల్టేజ్ డ్రామాతో పాటు ఉత్కంఠభరితమైన గేమ్ ఆడనున్నారు. ఈ షోను రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో నిర్వహించనున్నారు. ఇందులో కరణ్ కుంద్రా, రాజ్ కుంద్రా, రఫ్తార్, జాస్మిన్ భాసిన్, జన్నత్ జుబైర్, ఉర్ఫీ జావేద్, అన్షులా కపూర్, మహీప్ కపూర్, మంచు లక్ష్మీ కూడా కంటెస్టెంట్‌గా అడుగు పెట్టనున్నారు. ఈ రియాలిటీ షో గెలిచిన వారికి భారీగా నగదు బహుమతి అందుకోనున్నారు.అయితే గేమ్ షోను ఓటీటీ వేదికగా ప్రసారం చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12 నుంచి తొలి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ రియాలిటీ గేమ్ షోను వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ గేమ్ షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు కొత్త ఎపిసోడ్‌తో మీ ముందుకు రానుంది. -
‘బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశద్రోహులు’
బెంగళూరు: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచే బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఉద్యోగులను ఉద్దేశిస్తూ.. హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులన్నారు. కుమ్టే ప్రాంతంలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రసిద్ధ సంస్థను అభివృద్ధి చేయడానికి సంస్థ ఉద్యోగులు ఏమాత్రం ఇష్టపడటం లేదన్నారు. వీరంతా దేశ ద్రోహులని హెగ్డే విరుచుకుపడ్డారు. (బై బై బీఎస్ఎన్ఎల్.. భావోద్వేగానికి లోనైన ఉద్యోగి) అందుకే 88000 మంది ఉద్యోగులను తొలగించారని, సంస్థను ప్రైవేటీకరణ చేయనున్నారని హెగ్డే పేర్కొన్నారు. వారికి బుద్ధి చెప్పాలంటే ఇది ఒక్కటే సరైన పరిష్కారం అన్నారు హెగ్డే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. హెగ్డే వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ వ్యాఖ్యలు ఆయన చౌకబారు వ్యక్తిత్వానికి నిదర్శమని పేర్కన్నది. బీజేపీ అసమర్థత వల్లే బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ జరుగుతుందని ఆరోపించింది. కేంద్రం ప్రతిదానిని ప్రైవేటీకరిస్తుందని తెలిపింది. -
దేశద్రోహులకు మద్దతిస్తారా?: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి కి, ఉగ్రవాదులతో సంబంధమున్న వారికి దేశ పౌరసత్వం ఇవ్వాలా? దేశ ద్రోహులకు విపక్షాలు మద్దతునిస్తాయా అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని శరణార్థుల కోసం తీసుకొస్తే విపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయన్నారు. పార్టీ నేతలు పద్మ, సుధాకరశర్మలతో కలసి ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఎంఐఎం మోకాలికి, బోడి గుండుకు లంకె పెట్టేలా వ్యవహరిస్తున్నా యని ధ్వజమెత్తారు. దేశంపై తమ గుత్తాధిపత్యం కొనసాగాలనే అక్కసుతో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, అవకాశవాద పొత్తులతో కాంగ్రెస్ పార్టీ కాస్తా కమర్షియల్ పార్టీగా మారిందన్నారు. -
‘అలాంటి వ్యక్తికి అధికారం దక్కనివ్వం’
పూణె : దేశ ద్రోహులకు మద్దతిస్తున్న రాహుల్ గాంధీని అధికారంలోకి రానివ్వొద్దని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. శివసేన అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు ఉద్దవ్ ఠాక్రే. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మేనిఫెస్టోలో రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా’ అని ప్రజలను ప్రశ్నించారు. రాజద్రోహానికి పాల్పడే వారిని ఉరి తీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘దేశం మీద ప్రేమతో శివసేన, బీజేపీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మరి ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన కూటమి లక్ష్యం ఏంటి.. మేం దేశం కోసం కలలు కంటాం. మరి మీ కల ఏంట’ని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. అధికారాన్ని దక్కించుకోవడమే మీ ధ్యేయం అంటూ విమర్శించారు. రేపు కూడా మా ప్రధాని నరేంద్ర మోదీనే.. మరి మీ ప్రధాని ఎవరో చెప్పగలరా అంటూ ఆయన ప్రతిపక్షాలను సవాల్ చేశారు. -
'విద్రోహ' వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ విచారం
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిక కారణమైన వారు విద్రోహులంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. తాను పొరపాటున ఈ మాట అన్నానని ఒప్పుకున్నారు. విద్రోహులు అన్న మాట అనునుండాల్సింది కాదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కొంత మంది కార్యకర్తలు పార్టీకి సహకరించలేదని, వీరంతా విద్రోహులని అంతకుముందు ఆయన వ్యాఖ్యానించారు. 80 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన సమాజ్‌వాదీ పార్టీ కేవలం 5 చోట్ల మాత్రమే గెలిచింది. పార్టీ ఓటమిపై 26 జిల్లాల్లో సమీక్షలు నిర్వహించిన పరిశీలకులు నివేదికను సోమవారం రాంగోపాల్ యాదవ్ కు అందజేశారు. పరిశీలకులు ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా ఉందా, లేదా అనేది తర్వాత తెలుస్తుందన్నారు.


