Prem Singh
-
2 కి.మీ నడుచుకుంటూ వెళ్లిన సీఎం.. తిరిగొచ్చేటప్పుడు క్యాబ్..
గువాహటి: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సోమవారం రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లో అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు సుమారు 2 కిలోమీటర్లు నడిచారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరు అధికారులతో కలిసి క్యాబ్‌లో వెళ్లారు.ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు పద్ధతులు అమలు చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై నిబద్ధత చూపిస్తూ తమాంగ్ ఇలా చేశారు. అధికారిక నివాసమైన మింటోక్గ్యాంగ్ నుంచి మనన్ కేంద్రా వరకు సుమారు 14 నిమిషాలు నడిచి కార్యక్రమానికి హాజరయ్యారు.అంతేకాదు మే 15న అదే వేదికలో జరిగిన మరో కార్యక్రమానికీ వెళ్లేటప్పుడు, తిరిగి వస్తున్నప్పుడూ నడిచారు. “ఇది కేవలం మొక్కుబడిగా చేసింది కాదు. నాయకత్వం వ్యక్తిగత క్రమశిక్షణ, చర్యలతో ప్రారంభం కావాలని సిక్కిం ప్రజలకు బలమైన సందేశం ఇచ్చింది” అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.దేశం ఆర్థిక ప్రాధాన్యాలు, వనరుల సంరక్షణపై సమష్టిగా స్పందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. వ్యయాన్ని తగ్గించే చర్యలను ప్రభుత్వం కేవలం విధానాలకే పరిమితం చేయకుండా ఆచరణలోనూ అమలు చేస్తున్నట్లు తెలియజేస్తోందని సీఎంవో చెప్పింది.ప్రభుత్వ ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవడం, ఇంధన వినియోగ నియంత్రణపై సిక్కిం ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఇవి శాఖలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థలకు వర్తిస్తాయి.ఈ చర్యల్లో ముఖ్యమైనది ముఖ్యమంత్రి వాహన బృందాన్ని 50 శాతం తగ్గించడం. అదనంగా ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు ఆడ్-ఈవెన్ విధానం అమలు చేయనున్నారు. ట్యాక్సీలు, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.మే 14 నోటిఫికేషన్లో ఉద్యోగులు వీలైనంత వరకు ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించాలని, అవసరంలేని వాహన వినియోగం తగ్గించాలని, వర్చువల్ సమావేశాలు, డిజిటల్ సమన్వయంపై ఎక్కువగా ఆధారపడాలని ప్రభుత్వం సూచించింది. బాధ్యత, సమర్థత, క్రమశిక్షణతో కూడిన పాలనా సంస్కృతిని పెంపొందించడమే ఈ చర్యల లక్ష్యమని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. -
‘ముసలోళ్లయితే చనిపోవాల్సిందే’: కరోనా మృతులపై మంత్రి వ్యాఖ్యలు
భోపాల్: మహమ్మారి కరోనా వైరస్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అయితే పాలక ప్రభుత్వాలు మాత్రం దీన్ని తేలికగా తీసుకున్నట్టు కొన్ని సందర్భాలను చూస్తే తెలుస్తోంది. అయితే తాజాగా ఓ రాష్ట్ర మంత్రి కరోనా మరణాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ముసలోళ్లు అయితే చనిపోవాల్సిందే’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి బాధ్యతరాహిత్యానికి నిదర్శనమని ప్రజలతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ మంత్రి ప్రేమ్‌సింగ్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ‘కరోనా నుంచి కాపాడాలని, రక్షించాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే రోజు కరోనా మరణాలు జరుగుతున్నాయని నేను అంగీకరిస్తా. ఈ మరణాలను ఎవరూ ఆపలేరు. వయసు మీద పడిన వారు చనిపోవాల్సిందే’ అంటూ ప్రేమ్‌సింగ్ పేర్కొన్నారు. తాము కూడా కరోనా కట్టడి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి అని అనంతరం సలహా ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో రోజుకు పది వేలకు చేరువగా పాజిటివ్ కేసులు, 50కి కరోనా మృతులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలపై అక్కడి పార్టీలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WATCH: MP Minister Prem Singh Patel speaks on deaths due to #COVID19. He says, "Nobody can stop these deaths. Everyone is talking about cooperation for protection from Corona...You said that many people are dying every day. People get old and they have to die." (14.04.2021) pic.twitter.com/os3iILZGyM — ANI (@ANI) April 15, 2021 -
‘హోదాకు మద్దతిస్తాం.. కానీ..’
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పూర్తి మద్దతు ఇస్తామని శిరోమణి అకాలీదళ్ తెలిపింది. అయితే బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉండదని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ప్రేమ్‌సింగ్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్డీఏ సర్కార్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభ ముందుకు రాకముందే సభ మంగళవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యులు నిరసనలు తెలుపుతూ.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసనలు వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల్లో సభ నడపడం సాధ్యం కాదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. హోదా కోసం అలుపెరుగని పోరు చేపట్టిన వైఎస్సార్సీపీ ఎంపీలు మాత్రం ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళతామని పోరు కొనసాగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు చేపట్టేలా పట్టుపడుతున్నారు. -
ప్రేమ్ సింగ్‌కూ తప్పని ఓటమి
సాక్షి, న్యూఢిల్లీ: అంబేద్కర్‌నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా 11 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన చౌదరి ప్రేమ్‌సింగ్‌కు ఈ సారి చుక్కెదురైంది. ఢిల్లీ కాంగ్రెస్‌లో భీష్ముడిగా పేరుగాంచిన ప్రేమ్‌సింగ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అశోక్ కుమార్ ఓడించారు.సింగ్‌కు బీజేపీ అభ్యర్థి ఖుషీరామ్ చునార్ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఒకే పార్టీ అభ్యర్థిగా, ఒకే నియోజకవర్గం నుంచి అత్యధికసార్లు పోటీచేసి గెలిచిన నేతగా ప్రేమ్ సింగ్ గిన్నిస్ రికార్డు సృష్టించారు. 12వ సారి కూడా నెగ్గి తన రికార్డు నిలబెట్టుకోవాలన్న ఆయన ప్రయత్నం సఫలం కాలేదు. ఆఖరిసారి పోటీచేస్తున్నాను నన్ను గెలిపించండి అంటూ ప్రేమ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. అశోక్‌కుమార్ (ఆమ్ ఆద్మీ పార్టీ)కు 36,239 ఓట్లు, ఖుషీరామ్ చునార్ (భారతీయ జనతా పార్టీ)కు 24,569, ప్రేమ్ సింగ్‌కు 19,753 ఓట్లు వచ్చాయి. -
ఓటమి ఎరగని భీష్మపితామహుడు


