K Krithivasan
-
ప్రపంచ ఏఐ దిగ్గజంగా టీసీఎస్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత టెక్నాలజీ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యమని ఆ కంపెనీ సీఈవో, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు. 2025–26 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగానికి 2025–26 ఆర్థిక సంవత్సరం ఒక ‘కీలక మలుపు’ గా నిలిచిందన్నారు. క్లయింట్లు ఏఐని ప్రయోగాత్మక దశ నుంచి పూర్తిస్థాయి అమలువైపు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. టాప్ క్లయింట్ల ఫస్ట్ ఛాయిస్ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యం. ఏటా 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం అందించే 139 మంది కీలక క్లయింట్లలో ఇప్పటికే 130 మంది ఏఐ ప్రాజెక్టుల కోసం టీసీఎస్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం మా వ్యూహానికి దక్కిన విజయానికి నిదర్శనం’ అని కృతివాసన్ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి ఇంటెలిజెన్స్ వరకు పూర్తి స్థాయి (ఫుల్–స్టాక్) ఏఐ సేవలను అందించే సంస్థగా టీసీఎస్‌ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. 2.7 లక్షల మందికి ఏఐ శిక్షణ భారీ సాంకేతిక మార్పులకు అనుగుణంగా టీసీఎస్ ఉద్యోగులకు పెద్దఎత్తున శిక్షణ ఇస్తోందని కృతివాసన్ తెలిపారు. ప్రస్తుతం 2.7 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఏఐలో అత్యాధునిక నైపుణ్యాలు సాధించారని, గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందన్నారు. డిజిటల్ సేవల్లో చెరగని ముద్ర భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతంలో టీసీఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఈ–కామర్స్ వేదికగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ వేదిక ద్వారా జరిగిన కొనుగోళ్ల విలువ రూ.5 లక్షల కోట్లను దాటిందన్నారు. ఎస్బీఐ ‘యోనో 2.0’ను పది భాషల్లో 20 కోట్ల మందికి సేవలు అందించేలా అప్‌గ్రేడ్ చేశామన్నారు. కోటికి పైగా ఈ–పాస్‌పోర్టుల జారీ, ఆర్బీఐ కోసం 250 టీబీ డేటాను విశ్లేషించగల మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు వంటి మైలురాళ్లను ఆయన వివరించారు. వ్యూహాత్మక కొనుగోళ్లు, లక్ష్యాలు ఏఐ ఎకోసిస్టమ్‌లో ‘బిల్డ్–పార్ట్నర్–అక్వైర్’ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా అమెరికాకు చెందిన లిస్ట్ఎంగేజ్, కోస్టల్ క్లౌడ్ సంస్థలను కొనుగోలు చేశామని తెలిపారు. దీంతో గ్లోబల్ సేల్స్‌ఫోర్స్ కన్సల్టెంట్లలో టీసీఎస్ టాప్–5లో నిలిచిందన్నారు. అలాగే టీపీజీ భాగస్వామ్యంతో ‘హైపర్‌వాల్ట్’ ఏఐ మౌలిక సదుపాయాల వ్యాపారాన్ని ప్రారంభించామని, భారత్‌లో 1 గిగావాట్ (జీడబ్ల్యూ) సామర్థ్యం గల డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. మేధోపరమైన మౌలిక సదుపాయంగా కృత్రిమ మేధ కృత్రిమ మేధ (ఏఐ) ఇకపై కేవలం సాంకేతిక పరిజ్ఞానంలో ఒక భాగం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల నిర్వహణకు ‘మేధోపరమైన మౌలిక సదుపాయం’ గా మారుతోందని టీసీఎస్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హ్యూమన్ ప్లస్ ఏఐ’ ఆపరేటింగ్ మోడల్ అమలును టీసీఎస్ మరింత విస్తరించిందన్నారు. ఏఐ సేవల ద్వారా వార్షిక ప్రాతిపదికన 2.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,320 కోట్లు), క్లౌడ్, డేటా, సైబర్ భద్రత వంటి న్యూ–ఏజ్ సేవల ద్వారా 11.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.96,600 కోట్లు) ఆదాయం ఆర్జించినట్లు పేర్కొన్నారు. భారత్‌లో తొలి ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్: సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై భవిష్యత్ వ్యూహాన్ని కేంద్రీకరిస్తున్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. ఇందులో భాగంగా భారత్‌లో మొట్టమొదటి ‘ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్’ ను నిర్మించేందుకు టీసీఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఇది 160 కిలోవాట్ల (కేడబ్ల్యూ) కంటే ఎక్కువ ర్యాక్ డెన్సిటీతో అత్యంత శక్తివంతంగా ఉంటుందన్నారు. అలాగే వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ‘ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసి, ‘ఏజెంటిక్ ఏఐ’ సొల్యూషన్స్ అమలును వేగవంతం చేయడం కంపెనీ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంటుందన్నారు. జోరుగా లాభాలు.. నిలకడగా నియామకాలు: గత ఆర్థిక సంవత్సరపు(2025–26) ఫలితాలను విశ్లేíÙస్తూ కంపెనీ వృద్ధి బాటలో పయనిస్తోందని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి త్రైమాసికంలో టీసీఎస్ నికరలాభం 12.22 శాతం వృద్ధితో రూ.13,718 కోట్లకు చేరుకోగా, 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం లాభం రూ.49,210 కోట్లుగా నమోదైంది. గత రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో కొత్తగా 2,356 మందిని నియమించుకున్నామని తెలిపారు. దీంతో 2026 మార్చి 31 నాటికి సంస్థలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519 కి చేరింది. కొత్త డీల్స్: గడిచిన మూడు నెలల్లోనే టీసీఎస్ 12 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో ఉత్తర అమెరికా, బ్యాంకింగ్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలు కీలక పాత్ర పోషించాయి. భవిష్యత్తు వ్యూహాలపై ఫోకస్ భవిష్యత్తులో నాలుగు ప్రధాన వ్యూహాలపై దృష్టి సారించనున్నట్లు కృతివాసన్ వెల్లడించారు. వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏఐ వ్యవస్థల నిర్మాణంతో పాటు, భారత్‌లో తొలి ‘హై–డెన్సిటీ ఏఐ డేటా సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 3,600 భాగస్వామ్యాల సహకారంతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇంటెలిజెన్స్’ సేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశీయ డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. -
ఏఐకి భయపడం
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ)తో నెలకొన్న రిస్కుల గురించి తమ సంస్థ భయపడబోదని దేశీ ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎండీ కె. కృతివాసన్ స్పష్టం చేశారు. కంపెనీ ఆదాయం తగ్గినా ఫర్వాలేదు కానీ ఏఐ సాధనాలను వినియోగించుకోవడాన్ని నేర్చుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మొత్తం 6 లక్షల మంది ఉద్యోగుల్లో ప్రతీ ఒక్కరు కృత్రిమ మేధలో నిష్ణాతులుగా మారేలా ప్రయతి్నస్తున్నట్లు వివరించారు. ఇదే క్రమంలో కొంత భాగం ఆదాయాన్ని కోల్పోయినా, వివిధ ప్రాజెక్టుల్లో ఏఐని ఉపయోగించే విధానాలను అన్వేషించాలని సిబ్బందికి సూచించినట్లు కృతివాసన్ తెలిపారు. యువ సిబ్బందితో పోలిస్తే కృత్రిమ మేధ ఆధారిత సొల్యూషన్స్‌ని రూపొందించడంలో సీనియర్ ఉద్యోగులు కాస్త నెమ్మదిగా ఉంటున్న విషయాన్ని గమనించినట్లు వార్షిక నాస్కామ్ టెక్నాలజీ, లీడర్షిప్ ఫోరం (ఎన్టీఎల్ఎఫ్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. కొత్త ఏఐ నైపుణ్యాలు నేర్చుకునేలా ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండటం లేదని, అందరూ వాటిపై ఆసక్తిగానే ఉన్నారని పేర్కొన్నారు. అయితే, నైపుణ్యాలంటే చాట్‌జీపీటీ లాంటి ప్లాట్‌ఫాంకి ప్రాంప్్టలు ఇవ్వడం మాత్రమే కాదని, సిబ్బంది శ్రమించి ఏఐ సాధనాలతో కొత్త సొల్యూషన్స్‌ను రూపొందిస్తేనే ప్రయోజనకరమని కృతివాసన్ చెప్పారు. ఏఐ ప్రస్తుతం బోర్డు స్థాయి సమావేశాల్లోను ప్రధాన ఎజెండాగా ఉంటోందన్నారు. కొత్త టెక్నాలజీతో ఉత్పాదకత పెరుగుతుందని, కానీ, అలాంటి సాంకేతికతలతో తమ కస్టమర్లకు ఏవిధంగా ప్రయోజనం చేకూర్చగలం అనే అంశంపై కూడా తాము ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు. -
టీసీఎస్ క్యూ2.. ఓకే
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో నికర లాభం వార్షికంగా నామమాత్ర (1.4 శాతం) వృద్ధితో రూ. 12,075 కోట్లను తాకింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ. 11,909 కోట్లు ఆర్జించింది. ప్రధానంగా బీఎఫ్ఎస్ఐతోపాటు వివిధ విభాగాలలో వృద్ధి ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా 2.4 శాతం పుంజుకుని రూ. 65,799 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 64,259 కోట్ల టర్నోవర్ అందుకుంది. అయితే త్రైమాసికవారీగా (క్యూ2తో పోలిస్తే) నికర లాభం 5.3 శాతం క్షీణించగా, ఆదాయం 3.7 శాతం ఎగసింది. వాటాదారులకు ఒక్కో షేరుకీ రూ. 11 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 15 రికార్డ్ డేట్‌కాగా.. నవంబర్ 4కల్లా చెల్లించనుంది. క్యూ2లో అన్ని విభాగాలలోనూ వృద్ధి పథంలో సాగినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్ సేక్సరియా పేర్కొన్నారు. క్రమబద్ధ ఎగ్జిక్యూషన్, వ్యూహాత్మక పెట్టుబడులతో మార్జిన్లనకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. వేతన పెంపు, భవిష్యత్ అవసరాలకు సంసిద్ధత, కొత్త భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా, టీసీఎస్ క్యూ2లో 10 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకుంది. లిస్ట్ఎంగేజ్ కొనుగోలు మసాచుసెట్స్(యూఎస్) సంస్థ లిస్ట్ఎంగేజ్లో 100 శాతం వాటాను టీసీఎస్ కొనుగోలు చేసింది. ఇందుకు యాజమాన్య ప్రోత్సాహకాలు, వ్యయాలుకాకుండా 7.28 కోట్ల డాలర్లు (సుమారు రూ. 645 కోట్లు) వెచ్చించింది.డేటా సెంటర్లకు సై.. 57,700 కోట్ల పెట్టుబడి భారీ పెట్టుబడి ప్రణాళికలతో డేటా సెంటర్ల బిజినెస్‌లోకి ప్రవేశించనున్నట్లు టీసీఎస్ తాజాగా ప్రకటించింది. ఇందుకు రానున్న 5–7ఏళ్లలో 6.5 బిలియన్ డాలర్ల(రూ. 57,700 కోట్లు)పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కృతివాసన్ వెల్లడించారు. తద్వారా దశలవారీగా 1 గిగావాట్ సామర్థ్యంగల డేటా సెంటర్ ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. వీటికి పెట్టుబడులను ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు టీసీఎస్ వివరించింది. 150 మెగావాట్లకు బిలియన్ డాలర్లు అవసరంకాగా.. గిగావాట్ సామర్థ్యానికి 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెచ్చించవలసి ఉంటుందని కంపెనీ మదింపు చేసింది. టీసీఎస్ షేరు బీఎస్ఈలో 1.2% బలపడి రూ. 3,062 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వచ్చాయి.6,000 ఉద్యోగాల కోత కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 6,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు టీసీఎస్ సీహెచ్ఆర్వో సుదీప్ కున్నుమల్ వెల్లడించారు. ఇది మొత్తం సిబ్బంది సంఖ్యలో 1 శాతమేనని తెలియజేశారు. అయితే మరింత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తారన్న వదంతులను తోసిపుచ్చారు. కాగా.. ఐటీ నిపుణుల యూనియన్ నైట్స్ వివరాల ప్రకారం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య క్యూ2లో 5,93,314కు చేరింది. ఈ ఏడాది క్యూ1లో నమోదైన 6,13,069 సంఖ్యతో పోలిస్తే 19,755 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే ఈ క్యూ2లో 18,500 మందికి ఉపాధి కల్పించినట్లు కున్నుముల్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో డిమాండుకు అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీ సిబ్బందిలో 2%(12,261) మందిని తొలగిస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించడం తెలిసిందే.పటిష్ట పనితీరు క్యూ2లో ప్రదర్శించిన పటిష్ట పనితీరు సంతోషాన్నిచ్చింది. అంకితభావం, సామర్థ్యాలు చూపిన మా ఉద్యోగులకు కృతజ్ఞతలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సర్వీసుల కంపెనీగా అవతరించే ప్రయాణంలో ఉన్నాం. ఇందుకు అనుగుణంగా నైపుణ్యం, మౌలికసదుపాయాలు, వ్యవస్థాగత భాగస్వామ్యాలలో ట్రాన్స్‌ఫార్మేషన్‌కు ప్రాధాన్యతనిస్తున్నాం. తగిన పెట్టుబడులు వెచ్చిస్తున్నాం. – కె. కృతివాసన్, సీఈవో, ఎండీ, టీసీఎస్ -
టీసీఎస్ లాభం అప్ క్యూ3లో రూ. 12,380 కోట్లు
ముంబై: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది. విభాగాలవారీగా ప్రధాన విభాగం బీఎఫ్ఎస్ఐసహా కన్జూమర్ బిజినెస్ వృద్ధి బాట పట్టినట్లు కంపెనీ పేర్కొంది. కొన్ని విభాగాలలో విచక్షణాధారిత వినియోగం పుంజుకుంటున్నట్లు తెలియజేసింది. వీటికితోడు ప్రాంతీయ మార్కెట్ల నుంచి డిమాండ్ బలపడుతున్నట్లు వివరించింది. వెరసి భవిష్యత్ వృద్ధి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కంపెనీ ప్రణాళికలకు అనుగుణంగా క్యాంపస్ ప్లేస్మెంట్లు చేపడుతున్నట్లు మానవ వనరుల ప్రధాన అధికారి మిలింద్ లక్కడ్ తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో మరింత మందికి ఉపాధి కలి్పంచే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించారు. రూ. 1,625 కోట్లు వెచ్చించి టాటా గ్రూప్ కంపెనీ నుంచి బెంగళూరులో భూమిని కొనుగోలు చేసినట్లు టీసీఎస్ పేర్కొంది.ఇతర విశేషాలు → కొత్తగా 10.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు పొందింది. → ఉద్యోగుల సంఖ్యలో నికరంగా 5,370 కోతపడింది. → మొత్తం సిబ్బంది సంఖ్య 6,07,354 మందికి చేరింది.→ ఈ ఏడాది 40,000 క్యాంపస్ ప్లేస్మెంట్ల సాధనవైపు సాగుతోంది. → డివిడెండుకు రూ. 21,500 కోట్లు వెచ్చించనుంది. → నిర్వహణ లాభ మార్జిన్లు 0.4 శాతం మెరుగుపడి 24.5 శాతాన్ని తాకాయి. → ఐటీ సర్విసుల ఉద్యోగ వలసల రేటు 13 శాతంగా నమోదైంది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు 1.7% క్షీణించి రూ. 4,037 వద్ద ముగిసింది. ఆర్డర్ల జోరు పండుగల సీజన్ కారణంగా అధిక సెలవులున్నప్పటికీ భారీ కాంట్రాక్టులను సాధించాం. విభిన్న రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ లైన్లలో ఆర్డర్లు పొందాం. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయి. – కె.కృతివాసన్, సీఈవో, టీసీఎస్ -
క్యూ 2 లో టీసి 'ఎ స్'!
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్).. మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (2023–24, క్యూ2) కంపెనీ రూ. 11,342 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 10,431 కోట్లతో పోలిస్తే 8.7 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం 7.9 శాతం పెరుగుదలతో రూ. 55,309 కోట్ల నుండి రూ.59,692 కోట్లకు ఎగబాకింది. ఇక వాటాదారులకు టీసీఎస్ మరోసారి భారీ బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించడం విశేషం. మరోపక్క, మందకొడి ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగానికి ప్రతికూలతలు కొనసాగుతాయని కూడా కంపెనీ స్పష్టం చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇలా... ఈ ఆరి్థక సంవత్సరం జూన్ క్వార్టర్ (క్యూ1లో) నమోదైన రూ.11,074 కోట్లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 2.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం క్యూ1లో రూ.59,381 కోట్లతో పోలిస్తే క్యూ2లో అర శాతం పెరిగింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► క్యూ2లో కంపెనీ నిర్వహణ లాభం 9.1 శాతం వృద్ధితో రూ.14,483 కోట్లకు పెరిగింది. అదేవిధంగా నిర్వహణ మార్జిన్లు పావు శాతం పెరిగి 24.3 శాతానికి చేరాయి. ► భౌగోళికంగా చూస్తే, యూకే నుండి ఆదాయం 10.7 శాతం ఎగబాకగా, ఉత్తర అమెరికా నుండి స్వల్పంగా 0.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన మార్కెట్లలో మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఆదాయం 15.9 శాతం వృద్ధి నమోదు కాగా, లాటిన్ అమెరికా 13.1 శాతం, ఆసియా పసిఫిక్ 4.1 శాతం, భారత్ ఆదాయం 3.9 శాతం చొప్పున పెరిగాయి. ► విభాగాల వారీగా.. ఇంధనం, వనరులు, యుటిలిటీల నుండి ఆదాయం 14.8 శాతం పెరిగింది. తయారీ రంగం నుండి ఆదాయం 5.8 శాతం, లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ 5 శాతం పెరగ్గా, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్ (బీఎఫ్ఎస్ఐ) మాత్రం మైనస్ 0.5 శాతంగా నమోదైంది. ► సెపె్టంబర్ చివరి నాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కు చేరింది. క్యూ2లో నికరంగా 6,000 మంది సిబ్బంది తగ్గారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. క్యాంపస్ నియమకాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్నారు. ► క్యూ2లో కంపెనీ 11.2 బిలియన్ డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ఇందులో బీఎస్ఎన్ఎల్ 4జీ/5జీ, వాహన దిగ్గజం జేఎల్ఆర్కు సంబంధించిన డీల్స్ ప్రధానంగా ఉన్నాయి. ► ఇజ్రాయెల్‌లో 250 మంది కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నారని, యుద్ధ ప్రభావం అక్కడ తమ వ్యాపారాలపై పెద్దగా ప్రభావం చూపలేదని టీసీఎస్ సీఎఫ్ఓ ఎన్. గణపతి సుబ్రమణ్యం చెప్పారు. ► రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ రూ. 9 చొప్పన రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 19 కాగా, నవంబర్ 7న చెల్లించనుంది. దాదాపు రూ.3,300 కోట్లు ఇందుకు వెచి్చంచనుంది. టీసీఎస్ షేరు ధర బుధవారం బీఎస్ఈలో అర శాతం నష్టంతో రూ. 3,610 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బైబ్యాక్ బొనాంజా @ రూ.17,000 కోట్లు టీసీఎస్ బైబ్యాక్ పరంపరను కొనసాగిస్తోంది. రూ. 17,000 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బైబ్యాక్ షేరు ధరను రూ. 4,150గా నిర్ణయించింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ‘టాటా’ కరోనా మహమ్మారి కారణంగా కల్పించిన రిమోట్ వర్కింగ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) సదుపాయానికి టీసీఎస్ టాటా చెప్పింది. ఇకపై తమ ఉద్యోగులందరూ ఆఫీసుల నుంచే విధులు నిర్వర్తించాలని కంపెనీ బుధవారం ప్రకటించింది. కో–వర్కింగ్ వల్ల వ్యవస్థ విస్తృతం అవుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. మా సరీ్వస్‌లకు కొనసాగుతున్న డిమాండ్, క్లయింట్లు దీర్ఘకాల ప్రాజెక్టులకు కట్టుబడి ఉండటం, జెన్ ఏఐ ఇంకా ఇతర కొత్త టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా ఉపయోగించేందుకు చూపుతున్న ఆసక్తి.. మా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై భరోసా కలి్పస్తోంది. ఆరి్థక అనిశ్చితి కొనసాగుతోంది. దీనివల్లే ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగా నమోదైంది. అయితే పటిష్టమైన డీల్స్ జోరుతో ఆర్డర్ బుక్ భారీగా వృద్ధి చెందింది. మొత్తం కాంట్రాక్ట్ విలువ (టీసీవీ) పరంగా క్యూ2లో రెండో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ -
టీసీఎస్ కొత్త సీఈవో ట్రాక్ రికార్డ్, జీతం ఎలా ఉన్నాయంటే?
సాక్షి, ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఎండీ రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కంపెనీ వెటరన్ కె. కృతివాసన్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు.సంస్థ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI) బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్‌గా ఉన్న కృతివాసన్ కొత్త సీఈవోగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు. (గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు) చెన్నై నుంచి ముంబైక షిప్ట్ అవ్వడమే పెద్ద చాలెంజ్ టీసీఎస్ సీఈవోగా కంటే, చెన్నై వదిలి ముంబైకి మారడమే పెద్ద సవాల్ అని సీఈవోగా ఎంపికైన తరువాత తొలిసారి నిర్వహించిన శుక్రవారం నాటి మీడియా మీట్లో కృతివాసన్ చమత్కరించారు. మార్కెట్లో వచ్చే ప్రతి సవాల్ ఒక కొత్త అవకాశమని పేర్కొన్నారు. టాప్ఇండియన్ ఐటీ కంపెనీల సహచరులతో పోలిస్తే చాలా ఆలస్యంగా 58 ఏళ్లకు కీలక పదవికి ఎంపికయ్యారు అనేది నిపుణుల మాట. కాగా కీలక సమయంలో గత ఆరేళ్లుగా కంపెనీకి సీఎండీగా ఉన్న గోపీనాథన్, కంపెనీ చరిత్రలోనే తొలిసారి నాలుగేళ్ల ముందే కంపెనీని వీడారు. అయితే కృతివాసన్‌కు బాధ్యతల అప్పగింతల్లో భాగంగా గోపీనాథన్ సెప్టెంబర్ 15 దాకా కంపెనీలో కొనసాగుతారు. తాజాగా కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అయితే కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అత్యధిక వేతనం పొందుతున్న ఐటీ దిగ్గజాల సీఈవోల జాబితాలో గోపీనాథన్ ఐదో స్థానంలో ఉన్నారు. 2021-22 లో రూ. 25.75 కోట్లగా ఉన్న జీవితం 2023-23లో 26.6 శాతం పెరిగింది. దీంతో కృతివాసన్ ఎంత వేతనం పొందనున్నారనేది హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఎవరీ కృతివాసన్ చెన్నైకి చెందిన కృతివాసన్ 1989లో టీసీఎస్‌లో చేరారు. 34 సంవత్సరాలకు పైగా కంపెనీకి సేవలందిస్తున్నారు. హంబుల్‌గా, ప్రేమగా ఉండే కృతివాసన్‌కి అంతర్గతంగా మంచి గుర్తింపు ఉందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఐఐటీ కాన్పూర్ నుండి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. టీసీఎస్‌లో కీర్తివాసన్ డెలివరీ, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ మరియు సేల్స్‌లో వివిధ బాధ్యతలు, ఇతర రోల్స్ నిర్వహించారు. అలాగే టీసీఎస్ Iberoamerica , ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడుగాను, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేక్షక బోర్డు. సభ్యుడుగాను ఉన్నారు. కృతివాసన్ శాలరీ అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులలో ఒకరైన కె. కృతివాసన్ 2018-19లో రూ. 4.3 కోట్ల జీతం తీసుకున్నారు. తాజా పదోన్నతితో ఎంత ప్యాకేజీ, ఇతర ప్రయోజనలు లభించనున్నాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. -
గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు అనూహ్యంగా గుడ్‌బై చెప్పిన సీఈవో గోపీనాథన్ తన నిష్క్రమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుకోవడానికి ఇంతకంటే మంచి సమయం లేదని తాను భావించాననీ, సంతోషంగా, మనసంతా ఎంత తేలిగ్గా ఉందో చెప్పలేను..రీసెటింగ్కి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అంటూ గోపీనాథన్ వ్యాఖ్యానించారు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు మిగిలి ఉండగానే (ఫిబ్రవరి 21, 2027 వరకు) తన పదవికి రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది. అదీ కంపెనీ చరిత్రలో ఒక సీఈవో సమయానికి ముందే తమ రాజీనామాను చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీసీఎస్‌లో 22 ఏళ్ల సుదీర్ఘ కరియర్‌కు గుడ్‌బై చెబుతూ గోపీనాథన్ గురువారం రాజీనామా ప్రకటించారు. సాధారణంగా సిగ్గుపడే గోపీనాథన్ శుక్రవారం ఉదయం మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్షణమైతే ఆసక్తిపోతుందో.. ఆక్షణమే తప్పుకోవాలి (జిస్ దిన్ మన్ ఉడ్ జాయే, ఉఎస్ దిన్ నికల్ జానే కా!) గత 48 గంటలుగా చాలా స్వేచ్ఛగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే తన భవిష్యత్తు ప్లాన్ల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా టీసీఎస్ భవిష్యత్తు గురించి ఆలోచించి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తన ప్లేస్లోమరొకరు ఉండటం సముచితమని భావించానన్నారు. ఈ సందర్బంగా కృతివాసన్ సామర్థ్యంపై సంతృప్తిం వ్యక్తం చేశారు. అలాగే తన రాజీనామాపై టాటా సన్స్ ఛైర్మన్, టీసీఎస్ మాజీ సీఎండీ చంద్రశేఖరన్‌తో చర్చించి, వారం క్రితమే ఈనిర్ణయం తీసుకున్నట్లు గోపీనాథన్ వివరించారు టీసీఎస్‌లో ప్రతీ నిమిషం ఆస్వాదించానని చెప్పుకొచ్చారు. కానీ కొన్నిసార్లు కీలక మైలురాళ్లను చేరుకున్నప్పుడు, ఆలోచన మొదలవుతుంది. నెక్ట్స్ ఏమిటి? అనేది కచ్చితంగా పెద్ద ట్రిగ్గర్ పాయింటే.. కానీ ప్రస్తుతానికి ఎలాంటి క్లూ లేదు అని చెప్పారు. కాగా గోపీనాథన్ రాజీనామా ఇచ్చినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గోపీనాథన్ టీసీఎస్‌తోనే కొనసాగనున్నారు. అలాగూ కొత్త సీఈవోగా (డిజిగ్నేట్) బీఎఫ్ఎస్ఐ డివిజన్ గ్లోబల్ హెడ్‌గా ఉన్న కే కృతివాసన్‌ను నియమించినట్టు కంపెనీ ప్రకటించింది. 2001లో టాటా ఇండస్ట్రీస్ నుంచి టీసీఎస్‌లో చేరారు గోపీనాథన్ 20013లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, 2017లో సీఎండీగా ఎంపికయ్యారు.


