Hernia
-
హెర్నియా: చొచ్చుకుపోయే చిచ్చు..! ఎవరిలో అధికం అంటే..
మన కడుపులో ఉన్న అవయవాలూ, శరీర భాగాలు, పేగులు... ఇవన్నీ మన పొట్ట అడుగు భాగంలో ఉండే పొరల మీద అమరిపోయి ఉంటాయి.ఏవైనా కారణాల వల్ల ఈ ΄పొట్ట కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే పొట్టలోపల ఉండే భాగాలు... బలహీనంగా ఉన్న ఆ అబ్డామిన్ పొరల్లోంచి దూసుకొని (చర్మంలోనే) బయటకు వెళ్తాయి. ఇలా జరిగినప్పుడు పురుషుల్లోనైతే ఆ పేగులు... వృషణాల సంచిలోకి జారిపోవచ్చు. ఒకవేళ మహిళల్లోనైతే పొట్టలోని ఆ అవయవాలు అబ్డామిన్ కండరాలను దాటి లోపలికి వెళ్లవచ్చు. పొట్టలోనివే కాదు... మరే భాగంలోనైనా... ఒక దేహభాగం మరో దేహభాగంలోకి చొచ్చుకు వెళ్లడాన్ని ‘హెర్నియా’ అంటారు. ఇందులో చాలా రకాలుంటాయి. ఈ హెర్నియాలోని రకాలు, అలా జరిగినప్పుడు చేయించాల్సిన చికిత్సల వంటి పలు అంశాలను తెలుసుకుందాం...పొత్తికడుపు పొరల్లో బాగా బలహీనంగా ఉన్నచోటి నుంచి పొత్తికడుపులోని కొన్ని భాగాలు దూసుకుపోయి చర్మం కిందికి చేరుకుంటాయి. బయటి నుంచి చూసినప్పుడు అక్కడి చర్మం భాగం ఉబ్బినట్లుగా కనిపిస్తుంటుంది. సాధారణంగా పొత్తికడుపు ముందు భాగంలో చర్మం, కొవ్వు, కండరాలు వంటి పలుచోట్ల పొరలు ఉంటాయి. ఇవి పేగులతో పాటు కడుపులోని అంతర్గత భాగాలను తమ తమ స్థానాల్లో ఉండేలా చూస్తాయి. ఈ కండరాలు బలహీనంగా ఉన్న చోట్ల నుంచి కడుపులోని పేగులలో కొంత భాగం బయటకు వచ్చి చర్మం కింది నుంచి ఉబ్బు కనిపిస్తుంది. చేత్తో ముట్టుకున్నప్పుడు ఆ పేగుల భాగాలూ చేతి స్పర్శకు తెలుస్తుంటాయి. సహజంగా హెర్నియా వచ్చేందుకు అవకాశమున్న భాగాలు...కడుపులోని భాగాలు డయాఫ్రమ్ అనే భాగాన్ని దాటి ఛాతీ (లోయర్ ఛెస్ట్)లోకి. కడుపు కింది భాగాల నుంచి పొత్తికడుపు లేదా గజ్జల్లోని లోపలి భాగాల్లోకి. కడుపుకు మధ్యభాగం (మిడ్లైన్)లోకి. కడుపుపై శస్త్రచికిత్స జరిగినప్పుడు... బలహీనపడ్డ ఆ కోత భాగంలోకి.హెర్నియాల్లో రకాలివి... హెర్నియాల్లో అనేక రకాలుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి...ఇంగ్వైనల్ హెర్నియా : చాలా సాధారణంగా / ఎక్కువమందిలో కనిపించే హెర్నియా ఇది. మొత్తం హెర్నియాల్లో 75% ఇదే కనిపిస్తుంది. ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంది. రెండు వైపులా కూడా రావచ్చు. సాధారణంగా ఎక్కువ బరువు ఎత్తినప్పుడు కడుపులోని పేగులు... ఇంగ్వైనల్ కెనాల్ అనే ప్యాసేజ్ ద్వారా తొడల (అప్పర్ థైస్) భాగంలోకి వెళ్తాయి.ఫీమోరల్ హెర్నియా : ఇది కాస్తంత అరుదుగానే కనిపిస్తుంది. ఇంగ్వైనల్ కెనాల్ కింద ఉండే ఫీమోరల్ కెనాల్ ద్వారా కడుపులోని భాగాలు ముఖ్యంగా కొవ్వుపొరలు తొడల (అప్పర్ థైస్) దగ్గరికి చొచ్చుకురావడం వల్ల ఈ హెర్నియా కనిపిస్తుంది. సాధారణంగా ఫీమోరల్ హెర్నియా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంగ్వైనల్ హెర్నియాతో పోలిస్తే ఈ ఫీమోరల్ హెర్నియా కాస్త చిన్నదిగా ఉంటుంది. హయటల్ హెర్నియా : ఇది చాలామందిలో చాలా సాధారణంగా కనిపించే హెర్నియా. మన ఛాతీలో ఊపిరితిత్తులుండే భాగాన్నీ, కడుపులోని పేగులుండే భాగాన్ని వేరు చేస్తూ... డయాఫ్రమ్ అనే పొర ఉంటుంది. ఈ డయాఫ్రమ్ నుంచే...ఆహారాన్ని కడుపులోకి తీసుకెళ్లే అన్నవాహిక వెళ్తుంది. ఈ అన్నవాహిక కడుపులోకి వెళ్లే చోట డయాఫ్రమ్ దగ్గర బలహీనంగా ఉన్న సమయాల్లో కడుపులోని భాగాలు ఛాతీలోకి దూసుకువస్తాయి. ఈ కండిషన్‌నే హయటస్ / హయటల్ హెర్నియా అంటారు.కంజెనైటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా : హయటల్ హెర్నియాలోలాగే ఇక్కడ కూడా డయాఫ్రమ్ లోంచి ఛాతీలోకి పైకి వస్తాయి. అయితే ఇది పుట్టకతోనే (కంజెనైటల్గా) వచ్చే సమస్య. అంటే పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో అన్నవాహిక కడుపులోకి వెళ్తే చోట డయాఫ్రమ్ పూర్తిగా ముసుకుపోయినట్టుగా అభివృద్ధి చెందకపోవడంతో కడుపులోని భాగాలు ఛాతీలోని ఊపిరితిత్తులున్న చోటికి వస్తాయి.ఇన్సిషనల్ హెర్నియా : సర్జరీ వంటివి చేస్తున్నప్పుడు... కడుపుపైన గాటు పెట్టిన చోట అక్కడి కణజాలం బలహీనం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ గాటు ఉన్న చోటి నుంచి కడుపులోని భాగాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లుగా చర్మం కింది నుంచి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. మునుపు శస్త్రచికిత్స గాయం లేదా మచ్చ ఉన్న ప్రాంతంలో... ఆ గాయం సరిగా మానకపోయినా లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ తరహా హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. సాధారణంగా సర్జరీ తర్వాత రెండేళ్లలోపు ఇది కనిపిస్తుంది.అంబిలికల్ హెర్నియా / పారా అంబిలికల్ హెర్నియా : బొడ్డు దగ్గర బలహీనంగా ఉన్న ప్రాంతంలోంచి కడుపులోని భాగాలు బయటకు రావడాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. ఇది సాధారణంగా పుట్టుకతోనే (కంజెనైటల్గా) కనిపిస్తుంటుంది. చాలా సందర్భాల్లో చిన్నారికి ఏడాది వయసు వచ్చేనాటికి దానంతట అదే తగ్గిపోయే అవకాశాలెక్కువ. ఇక పారాంబిలికల్ హెర్నియా పెద్దవారిలో వస్తుంది. ఇది నాభి పైభాగంలో కనిపిస్తుంది. ఇందులోకి పేగులు చొచ్చుకుపోయి అక్కడ ఇరుక్కుపోయే ముప్పు ఉండటం వల్ల శస్త్రచికిత్స అవసరమవుతుంది. వెంట్రల్ హెర్నియా : కడుపు కింది భాగంలో ఉండే పొరల నుంచి అవయవాలు దూసుకు రాకుండా... కడుపు ముందుభాగంలోంచే కడుపులోని అవయవాలు ముందుకు వస్తుంటే దాన్ని ‘వెంట్రల్ హెర్నియా’ అని చెప్పవచ్చు. ఒకరకంగా చె΄్పాలంట అంబిలికల్ హెర్నియా, బొడ్డు దగ్గర వచ్చే ‘ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా’ వంటి వాటిని ‘వెంట్రల్ హెర్నియా’గా చెప్పవచ్చు.హెర్నియా ఎవరెవరిలో వస్తుందంటే... హెర్నియా అన్నది పురుషుల్లోనూ, మహిళల్లోనూ... ఇలా ఇద్దరిలో వచ్చే కండిషన్. చాలామంది పురుషుల్లో వచ్చే హైడ్రోసిల్ కండిషన్‌ను హెర్నియాతో పోల్చుకుని... ఆ రెండో ఒకటే అని అపోహ పడుతుంటారు. కడుపు కిందిభాగంలోని పొర... వయసు పెరగడం వల్లగానీ లేదా అరుగుదల వల్లగానీ, దెబ్బతగలడం వల్లగానీ లేదా కొందరిలో సహజంగానే ΄పొట్ట అడుగుభాగంలోని కండరం బలహీనపడ్డ సమయంలో కడుపులోని భాగాలు అందులోంచి దూసుకుని కిందికి వెళ్లడాన్నే ‘హెర్నియా’ అంటారు. స్త్రీ, పురుషుల్లో హెర్నియా పలు రకాలుగా రావచ్చు. అయితే పురుషులకు ఇంగ్వైనల్ హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. ఎందుకంటే పిండం శిశువుగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వృషణాలు పొత్తికడుపులోంచి నుంచి స్క్రోటమ్‌లోకి దిగేందుకు ఒక చిన్న మార్గం ఉంటుంది. దాన్నే ఇంగ్వైనల్ కెనాల్ అంటారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు టెస్టిస్ (బీజాలు) కూడా కడుపులోనే ఉంటాయి. మగబిడ్డ పుట్టగానే కడుపులోని ఆ టెస్టిస్ (బీజాలు) అదే మార్గం ద్వారా వృషణాల సంచిలోకి జారతాయి. మున్ముందు ఆ కెనాల్లోంచే పేగులు కూడా వృషణాల సంచిలోకి జారడం వల్ల ఇంగ్వైనల్ హెర్నియా వస్తుంది. ఇక పెద్ద వయసువారిలో ఏదైనా కారణం వల్లగానీ లేదా మలబద్దకం కారణంగా ముక్కినప్పుడు పొత్తికడుపుపై ఒత్తిడి పెరగడం వల్ల కూడా హెర్నియా వస్తుంది. ఇదే కాకుండా పొత్తికడుపుపై ఇతరత్రా కారణాలతో ఒత్తిడి పడటం కూడా హెర్నియాకు దారితీయవచ్చు. ఇక చిన్నారుల్లో సైతం పుట్టుకతో వచ్చే హెర్నియాలూ ఉండనే ఉన్నాయి. కడుపు కండరాలపై ఒత్తిడి కారణంగా హెర్నియా రావడానికి కారణాలు... క్రానిక్ అలర్జీల వల్ల చాలాకాలం పాటు గట్టిగా దగ్గాల్సిరావడం. పురుషుల్లో చాలా ఎక్కువసేపు అదేపనిగా నిలబడే వృత్తులో ఉండటం. గర్భధారణ వల్లగానీ చాలా ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీలు రావడం వల్ల. ఎక్కువ బరువు ఉండటం (బీఎమ్ 30 కంటే ఎక్కువగా ఉండటం).బరువైన వస్తువులను అకస్మాత్తుగా ఎత్తడం లేదా ఎక్కువ ఫోర్స్‌తో తోయడం.మలవిసర్జన సమయంలో ముక్కుతూ చాలా ఎక్కువ ఒత్తిడితో విసర్జనకు ప్రయత్నించడం. పెల్విస్ భాగంలో అయిన సర్జరీల వల్ల. చిన్నారుల్లో కంజెనైటల్ హెర్నియాలకు కారణాలు... నెలల పూర్తిగా నిండకముందే పుట్టడం (ప్రీ–మెచ్యుర్ డెలివరీస్). కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అనే ఆరోగ్య సమస్య ఉండటం. కడుపులోని బీజాలు సంచిలోకి వెళ్లకపోవడం (అన్–డిసెండెడ్ టెస్టిస్). మూత్ర వ్యవస్థ / రీప్రొడక్టరీ సిస్టమ్‌లో ఏవైనా సమస్యలుండటం. మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉండేవారిలో... మరీ ముఖ్యంగా ్ర΄ోస్టేట్ సమస్య ఉన్నవారిలో కూడా హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ.పెద్దవారిలో కనిపించే లక్షణాలుబరువైన వస్తువులు ఎత్తిన తర్వాత పొత్తికడుపు కింది భాగం (గ్రోయిన్)లో చిన్న ఉబ్బ / గడ్డలా కనిపించడం. మొదట్లో దాన్ని చేతితో లోపలికి నెట్టినప్పుడు కనిపించకుండా పోవడం తర్వాత మెల్లగా బయటకు రావడం దగ్గినప్పుడు లేదా గట్టిగా నవ్వినపుపడు ఉబ్బు బయటకు రావడం పడుకున్నప్పుడు ఉబ్బు / వాపు తగ్గిపోవడం. ఎందుకు చికిత్స అవసరమంటే...?సాధారణంగా హెర్నియా పెద్దగా నొప్పిని కలిగించదు. కానీ కొంతమందిలో నొప్పి లేదా బరువుగా అనిపించవచ్చు. కాలక్రమంలో ఉబ్బు / వాపు పెద్దదవుతుంది. పురుషుల్లో కొన్ని సందర్భాల్లో స్క్రోటమ్‌లోకి దిగిపోవచ్చు. ఇక పురుషుల్లోనూ, మహిళల్లోనూ కనిపించే హయటస్ హెర్నియాలో కడుపులోని యాసిడ్ పైకి తోసుకువచ్చే యాసిడ్ రిఫ్లక్స్ వంటి సందర్భాల్లో ఛాతీలో మంట, తీవ్రమైన అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించి చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఇక అప్పుడే పుట్టిన చిన్నారుల్లో కనిపించే కాంప్లికేషన్ల కారణంగా వాటిని సరిదిద్దాల్సిన అవసరం తప్పనిసరి. ఇక పెద్దవారిలో వచ్చే హెర్నియాలు సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా చికిత్స చేయడం అవసరం. ఇందుకు కారణాలు... కొన్ని సందర్భాల్లో హెర్నియా ఎటూ కదలలేకుండా ‘బిగుసుకుపోవచ్చు’. ఇలా బిగుసుకుపోవడాన్ని ‘ఇన్కార్సెరేషన్’ అంటారు. ఇలాంటి ‘ఇన్కార్సెరేటెడ్ హెర్నియా’లో నొప్పితో పాటు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఉదాహరణకు హెర్నియా కండిషన్ పెద్దపేగును బాగా బిగదీసి నొక్కుకుపోయేలా చేసినప్పుడు బయటకు వెళ్లాల్సిన గ్యాస్, విసర్జన జరగాల్సిన పదార్థాలూ అక్కడే ఆగిపోవచ్చు. ఇక కొన్నిసార్లు పేగు భాగం ఇరుక్కుపోయి ‘స్ట్రాంగ్యులేషన్’ అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు బిగదీసుకుపోయిన చోటి నుంచి కింది భాగానికి రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల తీవ్రమైన నొప్పితో పాటు పేగు దెబ్బతిని అక్కడి కణజాలం నశించిపోయే ప్రమాదం ఉంది. దీన్నే నెక్రోసిస్ / గ్యాంగ్రీన్గా కూడా చెబుతారు. ఇంగ్వైనల్ హెర్నియాలకంటే ఫెమోరల్ హెర్నియాల్లో ఈ ముప్పు చాలా ఎక్కువ. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి అది రవాణ సదుపాయానికి కూడా దారితీయవచ్చు. అందుకే హెర్నియా కండిషన్‌ను శస్త్రచికిత్స ద్వారా సరిచేయాల్సి ఉంటుంది. నిర్ధారణ బాధితుల్లోని ఉబ్బు భాగాన్ని భౌతికంగా పరీక్షించడం (ఫిజికల్ ఎగ్జామ్) ద్వారా హెర్నియాను చాలావరకు నిర్ధారణ చేస్తారు. కొన్ని సందర్భాల్లో సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలు అవసరం పడవచ్చు. హెర్నియాను ఎలా సరిచేస్తారు?హెర్నియాను చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా డాక్టర్లు సరిచేస్తారు. అయితే చిన్నపాటివీ (మైల్డ్), కొద్దిపాటి వాటికి వెంటనే శస్త్రచికిత్స అవసరం లేదు. ఇలాంటి వాటి విషయంలో డాక్టర్లు ‘వెయిట్ అండ్ వాచ్’ పద్ధతిని అనుసరిస్తారు. మరీ ప్రమాదకరం కాకుంటే తక్షణం శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని అంచనా వేస్తే తప్పక శస్త్రచికిత్స అవసరం. ఇది మందులతో తగ్గే కండిషన్ కాదు. పాతకాలంలో ‘ట్రస్’ (సపోర్ట్) పద్ధతి ద్వారా శస్త్రచికిత్స చేసేవారు. అయితే ఇప్పుడు ఆ పద్ధతిని ఎవరూ అనుసరించడం లేదు. శస్త్రచికిత్సలో రకాలుఓపెన్ సర్జరీ / హెర్నియా రిపేర్ సర్జరీ : హెర్నియాను శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. అంతర్గత అవయవాల్లోకి చొచ్చుకుపోయిన అవయవాలను / పేగులను లోపలికి యథాస్థానంలోకి నెట్టి, పొరలు బలహీనంగా ఉన్న చోటి నుంచి అవయవాలు మళ్లీ లోనికి జారిపోకుండా అక్కడ ‘మెష్’ (వల వంటి భాగాని అమర్చుతారు. మామూలుగానైతే 3–4 అంగుళాల కోత పెట్టి హెర్నియాను సరిచేస్తారు. సాధారణంగా స్పైనల్ అనస్థీషియా ఇస్తారు.లాపరోస్కోపిక్ హెర్నియా రిపేర్ : చిన్న చిన్న గాట్ల ద్వారా అతి చిన్న కెమెరా (లాపరోస్కోప్) సహాయంతో శస్త్రచికిత్స చేస్తారు. మెష్‌ను పెట్టి స్లేప్లింగ్ చేస్తూ దాన్ని స్థిరంగా ఉండేలా చూస్తారు. ఆ మెష్ కారణంగా మళ్లీ అవయవాలు లోపలికి జారవు. ఇందులో కూడా సాధారణంగా జనరల్ అనస్థీషియాతో ఇస్తారు.లాపరోస్కోపిక్ సర్జరీతో ప్రయోజనాలుచిన్న గాటు తక్కువ నొప్పి త్వరగా కోలుకోవడం త్వరగా వృత్తులకు వెళ్లగలగడం (అటెండ్ కావడం)రొబోటిక్ సర్జరీ : ఇప్పుడు రొబోటిక్స్ సహాయంతో కూడా శస్త్రచికిత్స నిర్వహించడం సాధ్యమే. దీంతో మరింత ఖచ్చితమైన రీతిలో (ప్రెసిషన్‌తో) శస్త్రచికిత్స చేయడం వల్ల త్వరగా కోలుకోవడం, తక్కువ నొప్పి వంటి ప్రయోజనాలన్నీ ఇందులోనూ ఉంటాయి.హెర్నియా నివారణ సాధ్యమేనా? హెర్నియాకు కారణమయ్యే కొన్ని అంశాలు మానవ నియంత్రణకు సాధ్యం కావు. అయితే కొన్ని సాధారణ అంశాలు పాటించడం ద్వారా హెర్నియాను చాలావరకు నివారించవచ్చు. అవి... బరువును అదుపులో ఉంచుకోవడం / అధిక బరువు తగ్గించడం ∙బరువైన వస్తువులను ఎత్తే సమయంలో జాగ్రత్తగా ఉండటం / అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం / బరువైన వస్తువులను తోసే విషయంలోనూ ఈ జాగ్రత్తలు అవసరంచాలాకాలం పాటు దగ్గుతూ / తుమ్ములు వస్తూ ఉండే క్రానిక్ పల్మునరీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స తీసుకుంటూ దగ్గు రాకుండా చూసుకోవడం మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవడం పురుషుల్లో ప్రొస్టేట్ సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం.హెర్నియాలు వారసత్వంగా వస్తుంటాయా? కొంతవరకు అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే జన్యుపరంగానూ, వాళ్ల దేహం తాలూకు స్వభావం వల్ల కడుపు కింది భాగంలోని పొరలు బలహీనంగా ఉండటం జరగవచ్చు. ఇలాంటి కుటుంబాల్లో తర్వాతి తరాల్లోనూ హెర్నియా రావచ్చు. అంతమాత్రాన తర్వాతి తరాల్లో ఇది అందరికీ వస్తుందని కాదుగానీ... హెర్నియా వచ్చేందుకు అవకాశాలు కాస్తంత ఎక్కువ.చివరగా... ముందుగా చెప్పినట్టు మైల్డ్ కేసుల్లో డాక్టర్లు వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలో హెర్నియాను గమనిస్తూ ఉన్నప్పటికీ... డాక్టర్లు సర్జరీ తప్పదని చెప్పినప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లడమే మంచిది. ఎందుకంటే హెర్నియా బిగదీసుకుపోయే ‘స్ట్రాంగ్యులేషన్’ కేసుల్లో అది మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించవచ్చు. అంతేకాదు... కొన్నిసార్లు ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలెక్కువ. అందుకే డాక్టర్ల సూచనలు తప్పనిసరిగా పాటించడం అవసరం.డాక్టర్ ఎన్. భరత్‌కుమార్, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిర్వహణ: యాసీన్(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?) -
90 ఏళ్ల వృద్దుడికి అరుదైన వ్యాధి..కడుపు ఛాతిలోకి చొచ్చుకుపోయి..
ఓ వృద్దుడు అత్యంత అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నూటికి ఒక్కరికి వచ్చే సమస్యతో నరకం చూశాడు. పాపం ఈసమస్యతో తినడం కూడా మానేశాడు. దీంతో రోజుల వ్యవధిలోనే ఐదు కిలోలు బరువు తగ్గిపోయాడు. వైద్యులు సైతం అతడి పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఇంతకీ అతడికీ ఏం వ్యాధి వచ్చిందంటే..90 ఏళ్ల వృద్ధుడు గత కొద్ది రోజులుగా అత్యంత అరుదైన విరామ హెర్నియాతో బాధపడ్డాడు. దీని కారణంగా కడుపు ఛాతీ భాగంలోకి చొచ్చుకు వచ్చి.. తిన్న ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చేసేది. ఇక్కడ పొట్టలో ఆహారం ఇమడక వెనక్కి వాంతి రూపంలో వచ్చేటప్పుడూ ఉండే బాధకు తాళ్లలేకపోయాడు. దీంతో అతడు తినడమే మానేశాడు. దెబ్బకు ఆ వృద్ధుడి కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఏకంగా 5 కిలోల మేర బరువు తగ్గిపోయాడు. ఇక్కడ హెర్నియా అనేది సాధారణ సమస్యే. ఒక అవయవం లేదా కణజాలం బలహీనమైన ప్రదేశం ద్వారా పొడుచుకు వచ్చినప్పుడు లేదా చుట్టుపక్కల కండరాలు లేదా బంధన కణజాలంలో చిరిగిపోయినప్పుడు అవి సంభవిస్తాయి. హెర్నియాలు తరచుగా ప్రాణాంతకం కానప్పటికీ, అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఈ వృద్ధుడికి వచ్చిన పరిస్థితి కాస్త క్రిటికల్.అతని కడుపులోని కొంత భాగం డయాఫ్రాగమ్‌లోని ఓపెనింగ్ ద్వారా ఛాతీలోకి నెట్టబడి ఊపిరితిత్తు కుదించుకుపోయేలా తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది. దీన్ని సివియర్ హయాటల్ హెర్నియా అనిపిలుస్తారు. ఇక్కడ వృద్ధుడి అధిక వయసు రీత్యా చాలా క్లిష్టమైన ఆపరేషన్ చేశారు వైద్యులు. డయాఫ్రాగమ్ లోపంను మూసి వేసి కడుపుని ఉదరకుహరంలోకి యథావిధిగా అమర్చారు. సదరు వృద్ధుడు కోలుకోవడమే గాక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు కూడా.(చదవండి: అత్యుత్తమమైన డైట్ ఇదే! నిర్థారించిన వైద్యులు!) -
ఆస్పత్రిలో శ్రియా భర్త, ఎమోషనలైన హీరోయిన్
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియ వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్నాక కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అటు కెరీర్‌ను ఇటు ఫ్యామిలీని రెండింటినీ బ్యాలెన్స్‌గా ఉంచుతోందీ సుందరి. తన ఫ్యామిలీతో ఆస్వాదించే క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే శ్రియ తన భర్త ఆండ్రీ ఆసుపత్రిపాలైన విషయాన్ని ఆలస్యంగా వెల్లడించింది. హెర్నియాతో బాధపడుతున్న అతడికి అపోలో ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ఈ సర్జరీ విజయవంతం కావడంతో శ్రియా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. 'నా భర్తకు మంచి చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు. సుమారు రెండు నెలల పాటు అతడు మా కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయాడు. ఇప్పుడతడు కోలుకున్నాడు. ఇందుకు సాయపడిన అపోలో ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌తోపాటు ఉపాసన కొణిదెల, డాక్టర్ రజనీష్ రెడ్డికి కృతజ్ఞతలు' అని శ్రియ రాసుకొచ్చింది. దీనికి ఆండ్రియో చేతికి బ్యాండేజీలతో దర్శనమిచ్చిన ఫొటోలను జత చేసింది. ఈ పోస్ట్‌పై స్పందించిన ఉపాసన అంతా సవ్యంగానే జరిగినందుకు సంతోషంగా ఉందని రిప్లై ఇచ్చింది. కాగా శ్రియా, ఆండ్రీలది ప్రేమవివాహం. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట 2018లో ఉదయ్‌పూర్ వేదికగా పెళ్లిపీటలెక్కింది. గతేడాది తనకు 9 నెలల కూతురు(రాధ) ఉన్నట్లు మీడియాకు వెల్లడించింది. ప్రస్తుతం శ్రియ హిందీలో 'దృశ్యం 2'లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
కోసేస్తారు..తీసేస్తారు..!
ఎంబీబీఎస్ చదవక పోయినా వారు డాక్టర్లుగా చెలామణీ అవుతున్నారు. పేరు ముందు డాక్టర్ అని బోర్డు తగిలించుకుని అబార్షన్లు, హెర్నియా, గర్భసంచి తొలగింపు వంటి శస్త్రచికిత్సలు చేస్తూ అనేక మంది మరణానికి కారణమవుతున్నారు. హైదరాబాద్‌లోనే ఇలాంటి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు గల్లీకొకరు వెలుగు చూస్తుండటంపై సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో 1804 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు ఉండగా వీటిలో కేవలం 800 ఆస్పత్రులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో ఐదు వేలకుపైగా క్లీనిక్స్ ఉన్నాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 1200 వరకు ఉన్నాయి. మిగిలినవన్నీ శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానికి అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా క్లీనిక్‌లు నడుపుతూ ప్రజారోగ్యంతో చలగాటమాడుతున్న కొంత మంది ఆర్ఎంపీలను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా పేరుకు ముందు డాక్టర్ అని చేర్చుకున్న వారిపై కేసులు నమోదు చేయడం విశేషం. హెర్నియా నుంచి అబార్షన్ల వరకు: బస్తీల్లోని నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న వీరు గైనకాలజిస్టులుగా, జనరల్ ఫిజిషయన్స్గా, జనరల్ సర్జన్స్‌గా చలామణి అవుతున్నారు. హెర్నియా, అపెండిసైటీస్, అబార్షన్లు, గర్భసంచి తొలగింపు తదితర ఆపరేషన్లు చేస్తున్నారు. కొన్నిసార్లు అధిక రక్తస్త్రావం వల్ల రోగులు మృత్యువాతపడుతున్నారు. నగరంలోని చార్మినార్, బార్కాస్, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, కంచన్‌బాగ్, బీఎన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం, భూపేష్గుప్తానగర్, నందనవనం, మీర్పేట్, హస్తినాపూర్, హయత్‌నగర్, వనస్థలిపురం, మన్సూరాబాద్, బండ్లగూడ, బోడుప్పల్, రాజేంద్రనగర్, మల్కజ్గిరి, మాణికేశ్వరినగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదులు అందగా, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దాడులు నిర్వహించి నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా వారు స్వయంగా డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు నడుపుతున్నారు. వీటికి ఎలా ంటి అనుమతులు లేకపోవడం కొసమెరుపు. మచ్చుకు కొన్ని ఘటనలుః ఫిలింనగర్ దుర్గాభవానీనగర్‌లో ఓ నర్సింగ్‌హోంలో గర్భవతికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో శిశువుకు జన్మనిచ్చి మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ నర్సు గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నట్లు చెప్పుకుంటూ రోగులకు చికిత్స చేస్తుండగా కంచన్‌బాగ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీరా సదరు మహిళ చదివింది బీఎస్సీనర్సింగ్ అని తెలిసి పోలీసులే నివ్వెర పోయారు. ఇటీవల చాంద్రాయణగుట్ట పరిధిలోని ఓ యునాని వైద్యుడు నొప్పితో బాధపడుతున్న ఓ రోగికి ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి మృతి చెందగా, శవాన్ని మూటలో కట్టి శంషాబాద్ సమీపంలో తగులబెడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన సంచ లనం సృష్టించింది. లేఖ రాసినా..స్పందన లేదు: హైదరాబాద్ జిల్లా పరిధిలో 1804 ఆస్పత్రులు ఉండగా, వాటిలో 800 ఆస్పత్రులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో 1100-1200 క్లీనిక్స్ ఉన్నట్లు గుర్తించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాటికి నోటీసులు జారీ చే శారు. అనుమతుల్లేని వాటికి మంచినీరు, డ్రైనేజీ, కరెంట్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ సహా టీఎస్ఎస్పీడీసీఎల్కు లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఆర్ఎంపీలు నిర్వహించే క్లీనిక్స్ పై చర్యలు తీసుకునే అధికారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు లేక పోవడంతో వారేమీ చేయలేక పోతున్నారు. 16 మంది నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లు అరెస్టు వైద్యం పేరుతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 16 మంది నకిలీ ఆర్ఎంపీలను సైబరాబాద్ ఈస్ట్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. షెడ్యూల్డ్ మందులు, ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఆర్ఎంపీలపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందడంతో సైబరాబాద్ ఈస్ట్ ఎస్ఓటీ డీసీపీ రాంచంద్రారెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కె.నర్సింగరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు ప్రత్యేకంగా ఆస్పత్రులను నిర్వహిస్తుండటం గమనార్హం. అరెస్టయిన వారి వివరాలు.. కె.రామలింగయ్య(శ్రీనివాస క్లీనిక్), కాళిదాస్(డాక్టర్ కాళీదాస్ పాలీ క్లీనిక్), కృష్ణమూర్తి( (విజయ పాలీక్లీనిక్)), మోహనాచారి( శ్రీసాయి క్లీనిక్), ఎస్.నరసింహులు(శ్రీ వెంకటసాయి క్లీనిక్),డి.శంకర్, ఎస్ఎం హుస్సేన్(అన్సారి క్లీనిక్), ఎం.పవన్‌కుమార్(శ్రీసాయి అక్షర క్లీనిక్), జనార్థనాచారి,డి.చెన్నారెడ్డి( వినిషా క్లీనిక్)లతో పాటు మేడిపల్లి, నాచారంలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోయినా క్లినిక్ లు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
హెర్నియా అని వస్తే...గర్భసంచి..!
హెర్నియా చికిత్సకు వచ్చిన ఓ యువకుడి కడుపులో గర్భసంచి బయటపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. వివరాలివీ.. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా చిట్టిపల్లికి చెందిన అమర్నాథ్(23) కొన్ని రోజులుగా హెర్నియా(బుడ్డ)తో బాధపడుతున్నాడు. అతడు గురువారం కుప్పంలోని ప్రియా నర్సింగ్ హోంలో చికిత్స చేయించుకునేందుకు వచ్చాడు. ఆపరేషన్ చేసిన వైద్యులు అతడి కడుపులో గర్భసంచి ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. హెర్నియాను తొలగించటంతోపాటు గర్భసంచిని బయటకు తీసి చికిత్స పూర్తి చేశారు. ఈ విషయమై ఆస్పత్రి డాక్టర్లు మాట్లాడుతూ.. ఇది చాలా అరుదైన కేసని..ప్రతి 5కోట్లలో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అమర్నాథ్కు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. -
హెర్నియా కౌన్సెలింగ్
మహిళలకు కూడా హెర్నియా వస్తుందా? ఇటీవల మాకు తెలిసిన ఒక మహిళకు హెర్నియా వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయాను. హెర్నియా అంటే ఏమిటో తెలియజేయగలరు. - రోహిత్, సంగారెడ్డి హెర్నియా అన్నది పురుషులకూ, మహిళలకూ ఇద్దరికీ వచ్చే కండిషన్. బహుశా మీరు పురుషులకు వచ్చే హైడ్రోసిల్ కండిషన్‌ను హెర్నియాతో పోల్చుకుని, రెండో ఒకటే అని అపోహపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మన కడుపులో ఉన్న అవయవాలూ, శరీర భాగాలు, పేగులు... ఇవన్నీ మన పొట్ట పైపొరల మీద అమరి ఉంటాయి. ఈ పొట్ట కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే పొట్టలోపలి భాగాలు బలహీనంగా ఉన్న అబ్డామిన్ పొరల్లోంచి దూసుకొని లోపలికి వెళ్తాయి. అలాంటప్పుడు పురుషుల్లో ఆ పేగు వృషణాల సంచిలో కనిపించవచ్చు. అలాగే మహిళల్లో అబ్డామిన్ కండరాలు బలహీనంగా ఉంటే మన పొట్టలోని అవయవాలు అబ్డామిన్ కండరాలను దాటి లోపలికి వెళ్లవచ్చు. అలాంటప్పుడు ఆ అవయవాలను శస్త్రచికిత్స ద్వారా యథాస్థితికి తెచ్చి, మళ్లీ అలా దూరిపోకుండా అబ్డామిన్ కండరాలపైన ఒక వలలాంటి దాన్ని (మెష్‌ను) అమర్చుతారు. హెర్నియా ఉంటే తప్పక ఆపరేషన్ చేయించాల్సిందేనా? ఇది మందులతో తగ్గదా? - శ్రీనివాస్, గన్నవరం మామూలుగానైతే బలహీనమైన అబ్డామిన్ కండరాల్లోంచి పేగులు కిందికి జారిపోయే హెర్నియా అనే కండిషన్ అంత ప్రమాదకరమైనదేమీ కాదు. చాలా సందర్భాల్లో దీనికి నొప్పి కూడా ఉండదు. పడుకున్నప్పుడు పేగు తన యథాతథ స్థితికి రావడం లేదా చేత్తో తాకినప్పుడు వృషణాల సంచిలో పేగు తగలడం వంటి వాటితో హెర్నియాను గుర్తించవచ్చు. అయితే ఒక్కోసారి ఇది చాలా సమస్యాత్మకంగా మారుతుంది. అబ్డామిన్ పొరల్లోంచి దూసుకుపోయిన ఈ పేగులు ఒక్కోసారి అక్కడి ఖాళీలో ఇరుక్కుపోయి తీవ్రంగా బిగుసుకుపోతాయి. దీన్నే స్ట్రాంగ్యులేటెడ్ హెర్నియా అంటారు. అప్పుడు అలా ఇరుక్కున్న పేగులకు రక్తసరఫరా అందకుండా పోవడంతో పేగులు పాడైపోతాయి. అలాంటప్పుడు మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం.ఏ. సలీమ్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్


